gangula bhanumathi: సోషల్ మీడియాలో తప్పుడు రాతలు.. పోలీసులకు గంగుల భానుమతి ఫిర్యాదు – gangula bhanumathi complaints police over social media posts on her husband


అనంతపురం జిల్లా ఎస్పీని కలిసిన మద్దెల చెరువు సూరి భార్య గంగుల భానుమతి. తమ కుటుంబంపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు రాతలు రాస్తున్నారని ఫిర్యాదు.

Samayam Telugu | Updated:

మద్దెల చెరువు సూరి సతీమణి గంగుల భానుమతి పోలీసుల్ని ఆశ్రయించారు. తన భర్తపై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్‌లు పెట్టారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పోస్టులు టీడీపీ నేతలు పెట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. తన భర్తను అవమానించే విధంగా పోస్టులున్నాయని.. చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు గురువారం అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబును కలిసి ఫిర్యాదు చేశారు.


పరిటాల రవి చాలా మంచివాడని.. తన భర్త సూరి అన్నట్లుగా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌‌లు పెట్టారని భానుమతి ఆరోపించారు. టీడీపీ అంటే సూరి ప్రాణమని చెప్పినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారు. తన భర్తను దుర్మార్గంగా చంపేశారని.. పరిటాల కుటుంబం కారణంగా తమకు సంబంధించిన ఎంతోమంది ఆప్తుల్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్‌ మీడియాలో తన భర్త, కుటుంబంపై అబద్దాలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు భానుమతి. తన ఫిర్యాదుపై ఎస్పీ సానుకూలంగా స్పందించారని.. ఈ సోషల్ మీడియా పోస్టుల వెనుక ఎవరున్నా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ కూడా తమకు హామీ ఇచ్చారంటున్నారు.

 

Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Web Title gangula bhanumathi complaints police over social media posts on her husband

(Telugu News from Samayam Telugu , TIL Network)

Source link