YS Jagan: జగన్ చేసిన ఆ పనిని బీజేపీ సీఎం ఎవరైనా చేసుంటే దేవుడితో పోల్చేవారు: ఆరెస్సెస్ మాజీ ప్రచారక్ – rss ex pracharak umesh ji praises ap cm ys jagan mohan reddy

admin
Read Time4 Minute, 21 Second


ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఆరెస్సెస్ మాజీ ప్రచారక్ ఉమేశ్ జీ ప్రశంసలు గుప్పించారు. జగన్ చేసిన ఆ పని సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఆయన బీజేపీ సీఎం కాకపోవడమే దీనికి కారణమన్నారు.

Samayam Telugu | Updated:

తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా బలపడాలని భావిస్తోన్న భారతీయ జనతా పార్టీ.. చేరికలను ప్రోత్సహిస్తోంది. హిందూ ముద్రతో దూసుకెళ్తున్న బీజేపీ.. ఏపీలోనూ అదే మంత్రాన్ని జపిస్తోంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ఆ పార్టీ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ఎన్నికల ముందు హిందువుల ఓట్ల కోసం తపించిన జగన్.. ఎన్నికలు ముగిశాక క్రిస్టియన్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే ప్రచారం మొదలైంది. అమెరికాలో జ్యోతి ప్రజ్వలన చేయడానికి జగన్ నిరాకరించారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో జగన్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.


గతంలో ఏ సీఎంలకు సాధ్యం కాని రీతిలో హిందువులను మెప్పించేలా జగన్ కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. హిందూయేతర వ్యక్తులు తిరుమల సహా రాష్ట్రంలోని ఏ ఆలయంలోనూ ఉద్యోగాలు పొందకుండా, ఆలయ పరిసరాల్లో షాపులు నిర్వహించకుండా జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ గతంలో ఆరెస్సెస్ ప్రచారక్‌గా పని చేసిన ఉమేశ్ జీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం హిందూ దేవాలయాలు, ధార్మిక సంఘాలు అన్యమతాల బారిన పడకుండా కాపాడుతుందన్నారు.

ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయం మేరకు.. వేరే మతస్తులు విక్రయించే పూలు, అక్షింతలు సహా ఏ పూజా వస్తువులను ఆలయాల్లోకి అనుమతించరు. ఆయన బీజేపీయేతర సీఎం కావడంతో ఈ వార్త సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. బీజేపీ సీఎం ఎవరైనా ఈ పని చేసి ఉంటే.. ఆయన్ను దేవుడి అవతారంతో పోల్చేవార’’ని ఉమేశ్ జీ వ్యాఖ్యానించారు. జగన్ శంఖారావం పూరిస్తోన్న ఫొటోను తన పోస్టుకు జత చేశారు. కొందరు బీజేపీ నేతలు ఆయనపై ‘మత’ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోన్న తరుణంలో ఆరెస్సెస్ మాజీ ప్రచారక్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Web Title rss ex pracharak umesh ji praises ap cm ys jagan mohan reddy

(Telugu News from Samayam Telugu , TIL Network)

 

Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Source link

0 0
Next Post

pakistan mineral water: జగన్ స్ఫూర్తితో.. పాక్ ప్రధాని మినరల్ వాటర్ బాటిల్ ప్లాన్ చూశారా! - pakistan govt launches its own mineral water to solve financial problems

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. ఖర్చులను తగ్గించుకునే పనులు మొదలుపెట్టారు. సీఎం ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారని, దుబారాకు నో చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రచారం చేశాయి. చూడండి బాబు గారి హయాంలో కాస్ట్‌లీ హిమాలయా వాటర్ బాటిల్ వాడితే.. జగన్ అన్న కిన్లే బాటిల్‌తోనే సరిపెట్టుకుంటున్నారు. జగన్ ఎలా డబ్బులు ఆదా చేస్తున్నారో చెప్పడానికి ఇదో నిదర్శనం మాత్రమే అని […]