warangal road accident : వరంగల్‌లో బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురు యువకులు దుర్మరణం – road accident in warangal rural district, 3 youth arrested

admin
Read Time45Seconds


వరంగల్‌ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌పై ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామానికి చెందిన ఇట్ల జగదీశ్‌(19), న్యాల నవీన్‌(20), జనగామ జిల్లా నర్మెట్ట మండలం మాన్‌సింగ్‌ తండాకు చెందిన లకావత్‌ గణేష్‌(21) ముగ్గురు గురువారం రాత్రి బైక్‌పై గంగదేవిపల్లికి వెళ్తున్నారు.


Also Read:
కర్నూలులో దారుణం.. నైట్ క్లాసుల పేరుతో అబ్బాయిలపై టీచర్ల లైంగిక దాడి

కాసేపట్లో గంగదేవిపల్లికి చేరుకుంటారనగా వీరి బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంతో గంగదేవిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. జగదీశ్, నవీన్ కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. చేతికి అందివచ్చిన కొడుకులు విగతజీవులుగా మారడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read:
హైదరాబాద్‌లో రోడ్డుప్రమాదం.. తూ.గో. జిల్లా యువకుడి దుర్మరణం





Source link

0 0
Next Post

Beggar, 73, Donates Rs 8 Lakh To Saibaba Temple In Andhra Pradesh's Vijayawada

The beggar said after he started donating to the temple, his income increased (Representational) Vijayawada: A 73-year-old beggar, Yadi Reddy, who has been seeking alms at the entrance of temples in Vijayawada, has donated Rs 8 lakh to the Saibaba temple in the course of last seven years. He eked […]