vijayawada rape case: తల్లి సహకారం.. బాలికపై అత్యాచారం.. – young man rapes minor girl in vijayawada

admin
Read Time2 Minute, 39 Second


తల్లి సహకారంతో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. ప్రేమ పేరుతో ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా విజయవాడలోని విద్యాధరపురంలో ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు..


Also Read:
బొమ్మలు కొనిస్తానంటూ 9 నెలల పసిపాపను మేనమామ తీసుకెళ్లి..!

విజయవాడలోని హెచ్‌బీ కాలనీకి చెందిన 15 ఏళ్ల బాలికను విద్యాధరపురం ప్రాంతానికి చెందిన సాయి అనే యువకుడు కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంటపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 2న బాలికకు మాయమాటలు చెప్పి విద్యాధరపురంలోని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దుశ్చర్యకు అతడి తల్లి కూడా సహకరించింది. దీన్ని అదనుగా చేసుకుని బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం కుటుంబ సభ్యుల సహకారంతో బాధితురాలు ఈ నెల 6న రాత్రి విజయవాడ, భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Also Read:
మా బిడ్డను రేప్ చేసి చంపినోళ్లనూ ఎన్‌కౌంటర్ చేయాల్సిందే..





Source link

0 0
Next Post

patancheru husband attack wife: కాపురం చక్కదిద్దుకునేందుకు వచ్చిన భార్యను బెల్టుతో కొట్టి.. కర్రలతో దాడి చేసి.. - patancheru husband attacks wife, her parents

కాపురం చక్కదిద్దుకునేందుకు వచ్చిన భార్యపై భర్త పాశవికంగా దాడి చేశాడు. అత్త, మామ, మధ్యవర్తి సహా భార్యపై సోదరుడితో కలిసి బెల్టు, కర్రలతో దాడికి దిగాడు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ కు చెందిన అనూషతో పటాన్‌చెరుకు చెందిన రఘుమారెడ్డికి (26) రెండేళ్ల క్రితం వివాహం (నవంబర్ 2017) జరిగింది. వీరికి ఏడాది వయసున్న కొడుకు కూడా ఉన్నాడు. అయితే పెళ్లి జరిగినప్పటి […]