vijayawada boy kidnap: క్రైమ్ థిల్లర్‌ను తలపించిన విజయవాడ కిడ్నాప్ కేసు.. 40 గంటల్లోనే నిందితుల అరెస్ట్ – 8 month old boy kidnapped in vijayawada, 2 held in jaipur

admin
Read Time46Seconds


విజయవాడలో 8నెలల బాలుడు అంకీస్‌ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు మెరుపువేగంతో స్పందించి కిడ్నాపర్లను పట్టుకున్నారు. ఇందుకోసం వారు నిందితుల కంటే ముందుగానే విమానంలో జైపూర్‌కు చేరుకోవడం విశేషం. టెక్నాలజీ సాయంతో కిడ్నాపర్లు ఏ క్షణాన ఎక్కడున్నారో తెలుసుకుంటూ సినీఫక్కీలో ప్లాన్ అమలు చేసి కేసును చేధించారు. 40 గంటల పాటు సాగిన ఆపరేషన్‌ విజయవంతం కావడంతో అటు పోలీసులు.. ఇటు చిన్నారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. క్రైమ్‌ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉత్కంఠభరితంగా సాగిన ఆపరేషన్ వివరాలిలా ఉన్నాయి.

Also Read:
ప్రియుడితో ఇంట్లోనే రాసలీలలు.. నాన్నతో చెబుతానన్న కొడుకుని దారుణంగా చంపేసింది

రాజస్థాన్‌కు చెందిన కొన్ని కుటుంబాలు విజయవాడ చుట్టుపక్కల మట్టివిగ్రహాలు తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారిలో పూలుబాయి, సోను దంపతుల కుమారుడు అంకీస్‌(8నెలలు) ఈ నెల 17వ తేదీన కిడ్నాప్‌కు గురయ్యాడు. తమ వద్ద తీసుకున్న రూ.36వేలు ఇస్తేనే పిల్లాడిని తిరిగి అప్పగిస్తామని బంధువులైన చాను, మాయ దంపతులు ఫోన్‌లో చెప్పి రాజస్థాన్‌ వెళ్లే రైలెక్కేశారు. బాలుడి తల్లిదండ్రులు వివిధ రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అదేరోజు సాయంత్రం ఆత్కూరు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Also Read:
యువతిపై కొడుకు రేప్.. వీడియో తీసి రూ.4లక్షలు దోచుకున్న తల్లి

రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులు 17వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు మన్నార్‌గుడి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి జైపూర్ వెళ్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు స్పెషల్ టీమ్‌ను ఏర్పాటుచేసి విమానంలో పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆపరేషన్ కోసం డీసీపీ- హర్షవర్దన్‌రాజు, ఏఎస్ఐ, కానిస్టేబుల్‌తో కూడిన టీమ్‌ అదేరోజు రాత్రికి విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంది. 18వ తేదీ ఉదయం మరో విమానంలో జైపూర్ బయలుదేరి 8 గంటలకల్లా అక్కడికి చేరుకున్నారు. ఇలా పోలీసులు 1,352 కిలోమీటర్ల దూరాన్ని రెండు విమానాల్లో ప్రయాణించి కిడ్నాపర్ల కంటే ముందే జైపూర్ చేరుకున్నారు.

Also Read:
కాపురానికి రావాలని కోరిన భర్త.. పురుషాంగం కోసేసిన భార్య

నిందితుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారి కదలికలను ఎప్పటికప్పుడు పోలీసులు గమనిస్తూనే ఉన్నారు. వారు మన్నార్‌గుడి ఎక్స్‌ప్రెస్‌లోనూ ఉన్నారని నిర్ధారణ చేసుకున్నారు. అప్పటికే విజయవాడ సీపీ జైపూర్ పోలీసులతో ఫోన్లో మాట్లాడి స్పెషల్ టీమ్‌కి సాయం చేయాలని కోరారు. ఉదయం 11 గంటలకు రైలు జైపూర్ స్టేషన్‌కు చేరుకున్నాక సీసీ కెమెరాల సాయంతో ప్రతి ఒక్కరినీ గమనించారు. ఎంత వెతికినా నిందితుల ఆచూకీ దొరకకపోవడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నిందితుల సెల్‌‌ఫోన్ సిగ్నల్ జైపూర్‌కు 7కిలోమీటర్ల దూరంలో ఉన్న దుర్గాపుర స్టేషన్ వద్ద కట్ కావడంతో వారు అక్కడి దిగి ఉంటారని అంచనా వేశారు.

కొద్ది సమయం తర్వాత సెల్‌ఫోన్ సిగ్నల్ జైపూర్‌లోని ట్రాన్స్‌పోర్ట్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొరకడంతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. 18వ తేదీ మధ్యాహ్నం నుంచి 19వ తేదీ ఉదయం వరకు అణువణువూ గాలించారు. గురువారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో చాను, మాయ దంపతుల ఆచూకీ కనిపెట్టి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. బాలుడు అంకీస్‌ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు, బాలుడితో స్పెషల్ టీమ్ శుక్రవారం విజయవాడ చేరుకుంటుందని పోలీసులు తెలిపారు.

Source link

0 0
Next Post

IAS Officer In Rs 40-Crore Kerala Flyover Case

TO Sooraj, a Kerala cadre-IAS officer, has claimed he acted on a minister’s order Kochi:  A Kerala-cadre IAS officer arrested over allegations of corruption related to a Rs 40-crore flyover project that will now be re-built has claimed he “acted on minister’s orders”. TO Sooraj, who was arrested last month […]