Unno gang rape Survivor: చికిత్స పొందుతూ ఉన్నావ్ రేప్ బాధితురాలు మృతి.. ఆమె చివరి కోరిక నెరవేరుతుందా? – up’s unno gang-rape survivor who was set ablaze on thursday died at safdarjung hospital

admin
Read Time44Seconds


దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమవ్వడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మృగాళ్ల దమకాండకు బలైన మరో దీపం మాత్రం శుక్రవారం ఆరిపోయింది. గతేడాది డిసెంబరులో అత్యాచారానికి గురైన ఉన్నావ్ యువతిపై నిందితులు రెండు రోజుల కిందట కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్‌లో శుక్రవారం రాత్రి కన్నుమూసింది. బాధితురాలిపై ఏడాది క్రితం అత్యాచారానికి పాల్పడిన నిందితులు.. ఆమె తమపై కేసు పెట్టిందన్న అక్కసుతో ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు.


ఈ నేపథ్యంలో గురువారం ఉదయం రాయ్‌బరేలీలోని కోర్టకు హాజరయ్యేందుకు వెళ్తున్న బాధితురాలిపై ఐదుగురు దాడిచేశారు. అనంతరం ఆమెపై కిరోసిన్ పోసి సజీవదహనానికి యత్నించారు. దీంతో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న బాధితురాలిని చికిత్స కోసం తొలుత స్థానిక హాస్పిటల్‌లో చేర్పించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం లక్నో తరలించగా, పరిస్థితి విషమించడంతో న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ఆమెను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 40 గంటలు మృత్యువుతో పోరాడి శుక్రవారం రాత్రి 11.40 గంటలకు తుది శ్వాస విడిచింది.

బాధితురాలని పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేసిన ఓ నిందితుడు మరో వ్యక్తితో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదుచేయడంతో పోలీసులు కేసు నమోదుచేసిన ప్రధాని నిందితుడిని మార్చిలో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడు నవంబరు 25న బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం మరికొందరితో కలిసి ఆమెను హత్యచేయడానికి పథకం వేశాడు. కేసు విచారణలో భాగంగా రాయ్‌బరేలీలోని కోర్టుకు హాజరయ్యేందుకుగాను గురువారం ఉదయం బాధితురాలు బయలుదేరగా.. ఐదుగురు వ్యక్తులు కలిసి ఆమెపై దాడి చేశారు. కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న శివం త్రివేది, శుభం త్రివేది కూడా సజీవదహనానికి యత్నించినవారిలో ఉన్నారు.

కాగా, బాధితురాలి సోదరుడి శుక్రవారం మధ్యాహ్నం మాట్లాడుతూ.. తీవ్రంగా గాయపడిన తన సోదరి చివరిసారిగా చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు. ‘నన్ను కాపాడండి, నేను బతకాలి.. నిందితులు తప్పించుకోలేరు.. వారిని తప్పకుండా ఉరి తీయాలని కోరిందన్నారు. నిందితులు ఎవరూ తప్పించుకోలేరని తాను కూడా ఆమెకు మాట ఇచ్చానని అన్నారు.

Source link

0 0
Next Post

west bengal molestation on baby: బొమ్మలు కొనిస్తానంటూ 9 నెలల పసిపాపను మేనమామ తీసుకెళ్లి..! - 9 months baby molestation by uncle in west bengal

‘దిశ’ నిందితులను ఎన్‌కౌంటర్ చేయగానే దేశం మొత్తం సంబరాలు చేసుకుంది. ఇక అమ్మా యిల మాన, ప్రాణాల జోలికి ఎవరూ రానని కొందరు ఆశించారు.. స్వీట్లు పంచుకున్నారు! కానీ, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై ఎన్‌కౌంటర్లు తాత్కాలిక ఉపశమనానికే గాని, శాశ్వత పరిష్కారం కాదనేలా పలు దిగ్భ్రాంతికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆడబిడ్డకు రక్తసంబంధీకుల నుంచి కూడా రక్షణ లేదా అని ఆలోచనలో పడేసేలా.. పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలోని హౌరా […]