undavalli sridevi controversy: తాను క్రిస్టియన్ అని ఉండవల్లి శ్రీదేవి చెబితే.. దళిత మహిళగా రాజకీయం ఏంటి?: బాబు – chandrababu naidu reacts to ysrcp mal undavalli sridevi controversy

admin
Read Time3 Minute, 7 Second


వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టీడీపీ నేతలు కులం పేరుతో దూషించిన ఘటన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేయాలని.. బాబు ప్రోత్సాహంతోనే టీడీపీ నేతలు తనను దూషించారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు.


తాను క్రిస్టియన్ అని, భర్త కాపు కులస్తుడని ఉండవల్లి శ్రీదేవి ఇంటర్వ్యూలో చెప్తే.. వైఎస్ఆర్సీపీ వాళ్లు దళిత మహిళగా రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తెలుగుదేశం నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు. ఎస్సీలకు కేటాయించిన అసెంబ్లీ సీటును క్రిస్టియన్‌కు కట్టబెట్టి, అన్యాయం చేసింది వైఎస్ఆర్సీపీ కాదా అని ఎస్సీలే నిలదీస్తుంటే మీ జవాబేంటని చంద్రబాబు ట్వీట్ చేశారు.

మత ఘర్షణలు సృష్టించడం, కులాల మధ్య చిచ్చుపెట్టడం వైఎస్ఆర్సీపీకి పుట్టుకతో వచ్చిన సిద్ధాంతమని బాబు ఎద్దేవా చేశారు. బలహీన వర్గాల కోసం, సామాజిక న్యాయం కోసమే టీడీపీ పుట్టిందన్నారు. వైఎస్ఆర్సీపీలాగా కుల రాజకీయాలు చేయడం టీడీపీ సంస్కృతి కాదన్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో అధికార పార్టీ కావాలనే కులాల కార్చిచ్చు రగిలిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.





Source link

0 0
Next Post

Andhra Pradesh government seeks Rs 25,000 crore additional loan from New Development Bank- The New Indian Express

By PTI AMARAVATI: The Andhra Pradesh government has sought an additional Rs 25,000 crore as loan from the New Development Bank, apart from the Rs 6,000 crore loan that is now pending approval. Chief Minister YS Jagan Mohan Reddy discussed the loan proposals with NDB Vice-President N Jong and project […]