teachers day 2019: ఆచార్యుడి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన ‘భారతరత్నం’.. డాక్టర్ సర్వేపల్లి – importance and significance of teachers day, doctor sarvepalli birth anniversary

admin
Read Time8 Minute, 45 Second


నా పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరపండంటూ తన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడానికి వచ్చిన వారిని ఉద్దేశించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్న మాటలివి. తరాలు మారినా గురుస్థానం మారకూడదన్న తన ఆశయానికి అనుగుణంగా ఆ మహనీయుడు చేసిన సూచన భారతదేశ చరిత్రలో సెప్టెంబరు 5కి విశిష్ట స్థానాన్ని కల్పించింది. సకల విద్యాపారంగతుడైన రాధాకృష్ణ పండితుని స్మరించుకునే అవకాశాన్ని అందించింది. సనాతన భారతీయ సంప్రదాయంలో గురువు ప్రాధాన్యత గణనీయమైంది. ఆయన సమక్షంలో నేర్చుకునే విద్య మనిషి జీవితానికి అర్ధాన్ని, పరమార్ధాన్ని చేకూరుస్తుందన్న భారతీయుల భావన యుగాలనాటి నుంచి గురుశిష్య బంధాన్ని చిరంజీవిగా నిలుపుతోంది.


పురాణేతిహాసాలు సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదేనని తెలిపాయి. గురువుకు దైవత్వాన్ని ఆపాదించాయి. అందుకే మాతృదేవోభ‌వ‌, పితృదేవోభ‌వ‌, ఆచార్యదేవోభవ అన్నారు. పూర్వకాలంలో గురువులను వెదుక్కొంటూ వెళ్లి, ఆయనను ప్రసన్నం చేసుకుని సకల విద్యలను శిష్యులు నేర్చుకునేవారు. విద్యాభ్యాసం పూర్తయినంతవరకు ఆయన సహచర్యంలోనే గడిపి నిరంతరం గురువు పట్ల భక్తి శ్రద్ధలు కనబరిచేవారు. అయితే నేటి ఆధునిక కాలంలో మాత్రం గురువు అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా సర్వేపల్లిని చెప్పుకుంటారు.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణి గ్రామంలో 1888 సెప్టెంబరు 5 న జన్మించారు. ఓ సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదొడుకుల మధ్య కొనసాగింది. కటిక పేదరికాన్ని అనుభవించిన సర్వేపల్లికి కనీసం చదువుకోవడానికి పుస్తకాలు కూడా ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో పుస్తకాలు కొనుక్కోగలిగిన స్థోమత ఉండి, కొనుక్కున్న వ్యక్తి ఇంటికి వెళ్లి ఆయనను ‘అయ్యా..ఒక్క కాగితం నలగకుండా నేను పుస్తకం చదువుకుంటాను. దయచేసి నాకు పుస్తకం ఇప్పించండి’ అని ప్రార్థన చేసి తెచ్చుకుని చదువుకునేవారు.

పుస్తకాలు ఉన్న వ్యక్తులు తనను ఎప్పుడు రమ్మంటే అప్పుడే వెళ్లి, వాటిని తెచ్చుకుని చదివి గొప్ప తత్వశాస్త్రవేత్త అయ్యారు. తత్వశాస్త్రంపై మక్కువతో అదే ప్రధానాంశంగా మాస్టర్స్ డిగ్రీలో ‘ది ఎథిక్స్ ఆఫ్ వేదాంత’ను థీసిస్‌గా ఎంపిక చేసుకుని 20వ ఏటనే సమర్పించిన ప్రతిభాశాలి రాధాకృష్ణన్. 21 ఏళ్లకే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్‌గా చేరిన రాధాకృష్ణన్ ప్రతిభను గుర్తించిన మైసూరు విశ్వవిద్యాలయం ఆయనను తత్వశాస్త్ర విభాగానికి ఆచార్యుడిగా నియమించింది. ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ విధులు నిర్వహించారు.

నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయవృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు. ఎదుటివారికి బోధించటం వల్ల, తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని బాగా నమ్మిన వ్యక్తి ఆయన. వేలాదిమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆయన తర్కం లాంటి కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు సులభంగా బోధించేవారు. ఆధునిక కాలంలో విద్యార్థికీ, ఉపాధ్యాయుడికీ మధ్య సంబంధం ఎలా ఉండాలో కూడా ఆచార్య రాధాకృష్ణ జీవితం అనేక పాఠాలను నేర్పుతుంది. ఆచార్యుడిగా, ఉపకులపతిగా, దౌత్యవేత్తగా, స్వాతంత్ర భారతావని తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా అధిరోహించిన శిఖరాలు, ఆయన జీవితంలోని అసాధారణ కోణాలను తెలియజేస్తున్నాయి.

గురువు అంటే గు అంటే చీకటి, రువు అంటే వెలుగు నింపేవాడు…. అజ్ఞానం చీకట్లు తొలగించి, జ్ఞానజ్యోతిని వెలిగించేవాడని అర్థం. అందుకే భారతీయ పరంపర గురువుకు గొప్ప స్థానాన్ని కల్పించింది. ఆ గౌరవాన్ని నిలుపుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి ఉపాధ్యాయులు సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకుని, బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి.

చదువులో చురుకుగా ఉండే సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు తల్లితండ్రులు ఉపనయనం చేశారు. ఇందులో భాగంగా ఆయన చెవులకు పోగులు పెట్టారు. ఇది జరిగిన అనంతరం తను చదువుకునే ఊరికి తిరిగి నడిచి వస్తున్నారు. పరీక్షకి రుసుం చెల్లించటానికి అదే చివరి రోజు. అలా వస్తున్న రాధాకృష్ణన్‌ ఒక దొంగ అడ్డగించి, దాడిచేసి చెవి పోగులు లాక్కున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో హడలిపోయిన సర్వేపల్లికి ఒళ్ళునొప్పులు, జ్వరం వచ్చింది. దీంతో పరీక్ష ఫీజు విషయం మర్చిపోయి పాఠశాలకు కూడా వెళ్ళకుండా నిద్రపోయారు. ఇదే సమయంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? అని ప్రధానోపాధ్యాయుడు పరిశీలించారు.

అందులో రాధాకృష్ణన్ పేరు చూసి, “అయ్యో! చాలా బాగా చదువుకునే విద్యార్థి ఈరోజు రాకపోవడమేంటి? అని పరీక్ష రుసుం ఆయనే చెల్లించారు. ఆ తరువాత రాధాకృష్ణన్ పరీక్షల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఉపాధ్యాయుడంటే ఎలా ఉండాలో చూసిన రాధాకృష్ణన్ ఈ సంఘటన తన జీవితంలో మర్చిపోలేదు. అందుకే ఒక ఉపాధ్యాయుడు ఒక వ్యక్తిని ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలరో తెలుసుకుని, ఆచరించిన మహా పురుషుడు. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన తత్వశాస్త్రవేత్త అయినా, రాష్ట్రపతి పదవిని అలంకరించినా, భారతరత్నను అందుకున్నా తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవం పరమ పవిత్రంగా చెయాలని కోరుకున్నారు.

Source link

0 0
Next Post

Ganesha Made With 2 Lakh Bangles Steals Show In Andhra Pradesh Village

Thirty artistes have worked together for 15 days to design the 30-feet tall Bangle Ganesha. Chittoor, Andhra Pradesh:  A 30-feet-tall Lord Ganesha made up of around 2 lakh bangles is the new centre of attraction for devotees who are arriving in large numbers for the darshan of Bangle Ganesha at […]