tamilnadu illegal affair: మరో అఫైర్ పెట్టుకున్నాడని ప్రియుడికి నిప్పు పెట్టిన వివాహిత – tamilnadu woman attack on lover over illegal affair

admin
Read Time4 Minute, 4 Second


కట్టుకున్న భార్యను మోసం చేస్తూ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలియడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో ప్రియురాలిని ఇంటికి తెచ్చుకుని సహజీవనం మొదలుపెట్టాడు. ఆ బంధానికీ విలువ ఇవ్వకుండా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలుసుకున్న ప్రియురాలు అతడి భార్యలా వదిలేయలేదు. ప్రియుడితో వాగ్వాదానికి దిగి పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

Also Read:
ప్రియుడితో బెడ్రూమ్‌‌లో భార్య రొమాన్స్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన భర్త

విల్లుపురానికి చెందిన వెంకటేష్‌ (31) ఆవడిలో స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ సత్యమూర్తినగర్‌లోని పోలీసు క్వార్టర్స్‌లో నివశిస్తున్నాడు. అతడికి 2012లో జయ అనే మహిళతో వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్ పులియాంతోపు ప్రాంతానికి చెందిన ఆశా(32) అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు అంతకుముందే మరో వ్యక్తితో వివాహమైన ఇద్దరు పిల్లలున్నారు. ఈ విషయం తెలుసుకున్న జయ భర్తను నిలదీసినా అతడిలో మార్పు రాలేదు. దీంతో ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

Also Read:
అప్పులు తీర్చడానికి భార్య శీలాన్ని తాకట్టు పెట్టిన భర్త

ఇదే అదనుగా భావించిన వెంకటేశ్ తన ప్రియురాలు ఆశాను తన క్వార్టర్స్‌కే తీసుకొచ్చి సహజీవనం మొదలుపెట్టాడు. ఇలా ఉండగానే వెంకటేశ్ ఓ మహిళా పోలీసుతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆశాను నిర్లక్ష్యం చేయసాగాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె శనివారం మద్యం తాగి ఇంటికొచ్చిన వెంకటేశ్‌తో గొడవ పెట్టుకుంది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఆశా ప్రియుడిపై పెట్రోల్ పోసింది. ఆమె బారి నుంచి తప్పించుకుని పారిపోతున్న వెంకటేశ్‌పై అగ్గిపుల్ల వెలిగించి వేసింది. మంటల్లో కాలిపోతూ బయటకు పరుగులు తీసిన అతడిని స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆశాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read:
భర్త కళ్లుగప్పి ఇద్దరితో అక్రమ సంబంధం.. ఆమె కోసం నడిరోడ్డుపై ఘర్షణ





Source link

0 0
Next Post

Raids reveal rampant child trafficking in A.P.

‘Operation Muskaan’ in which officials have recently rescued 2,774 boys and girls has revealed the magnitude of the child trafficking menace in Andhra Pradesh. Police, in association with Women Development and Child Welfare (WD&CW), Labour, Revenue, Child Welfare Committees (CWCs) and other departments conducted raids and rescued 2,774 children, including […]