tamil nadu man murder : పెళ్లికూతురి పక్కింటి వ్యక్తిని నరికేసిన పెళ్లికొడుకు.. కారణం తెలిస్తే షాకే.. – young man hacked to death for stopping minor girl’s marriage in madurai of tamil nadu

admin
Read Time4 Minute, 35 Second


తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పక్కింట్లో ఉండే యువకుడిని పెళ్లికొడుకు నడిరోడ్డుపై కిరాతకంగా నరికి హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. యువకుడు సమాచారం ఇవ్వడం వల్లే పోలీసులు తమ పెళ్లిని నిలిపివేశారని అనుమానించి కక్ష పెంచుకుని దారుణానికి తెగబడ్డాడు. తండ్రి కళ్లెదుటే వెంటపడి వేటాడి నరికేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడా యువకుడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.


మదురై జిల్లాకు చెందిన విజయ్‌ కుమార్ అనే యువకుడికి ఓ అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. సడెన్‌గా పోలీసులు ఎంట్రీ ఇచ్చి పెళ్లిని నిలిపివేయించారు. అమ్మాయికి ఇంకా 18 ఏళ్లు నిండలేదని.. మైనర్ వివాహం చట్టరీత్యా నేరమని హెచ్చరించి పెళ్లిని అడ్డుకున్నారు. తీరా ఇక్కడిదాకా వచ్చాక పెళ్లి ఆగిపోవడంతో పెళ్లికొడుకు కోపంతో రగిలిపోయాడు.

Also Read:
గప్‌చుప్‌గా కూతురిని చంపి తగలెట్టేసిన రాక్షసుడు.. నిజం తెలిసి షాక్‌కి గురైన పోలీసులు

బాలిక పక్కింట్లో ఉండే రామ్మూర్తి అనే యువకుడిపై అనుమానం పెంచుకున్నాడు. ఆ అమ్మాయి కుటుంబానికి రామ్మూర్తి కుటుంబానికి మాటల్లేకపోవడంతో.. అతనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటాడని అనుమానం పెంచుకున్నాడు. తన పెళ్లి ఆగిపోవడానికి రామ్మూర్తే కారణమన్న కోపంతో అతనిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులతో కలసి హత్య చేసేందుకు పక్కా ప్లాన్ రూపొందించాడు.

ఓ రోజు రామ్మూర్తిని అతని తండ్రి బైక్‌పై ఇంటి వద్ద దిగబెడుతున్న సమయంలో పెళ్లికొడుకు విజయ్ కుమార్ అడ్డుకున్నాడు. విజయ్‌ని చూసిన వెంటే రామ్మూర్తి ప్రాణాపాయాన్ని ఊహించి అక్కడి నుంచి పరిగెత్తడంతో వెంటాడి వేటాడారు. విజయ్ కుమార్ అతని స్నేహితులు రంజిత్, కురుప్పు రాజా, మణికందన్ పదునైన ఆయుధాలతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు.

Read Also: కామపిశాచిగా మారిన కన్నతండ్రి.. కూతురిపై నెల రోజులుగా దారుణం

ప్రాణ భయంతో భర్త పెట్టిన కేకలు విని రామ్మూర్తి భార్య బయటకు వచ్చి చూసే సరికే అతను రక్తపు మడుగులో నేలకొరిగాడు. పదునైన ఆయుధాలతో దారుణంగా నరకడంతో అక్కడికక్కడే రామ్మూర్తి ప్రాణాలు వదిలాడు. విగతజీవిగా కనిపించిన భర్తని చూసి రామ్మూర్తి భార్య షాక్‌కు గురైంది. రామ్మూర్తి తండ్రి నల్లుసామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.





Source link

0 0
Next Post

Andhra Pradesh Takes Over 58 Private Hospitals To Boost COVID-19 Infrastructure

The production of ventilators, testing kits, other equipment has started in Visakhapatnam (File) Hyderabad: The Andhra Pradesh government has taken over 58 private hospitals across 13 districts in the state to manage and cope with the growing number of coronavirus cases. A total of 19,114 beds are available in these […]