sudan factory explosion: సూడాన్ ఫ్యాక్టరీలో పేలిన గ్యాస్ ట్యాంకర్.. 18 మంది భారతీయులు దుర్మరణం! – at least 18 indians killed in ceramic factory fire in sudan says indian embassy

admin
Read Time44Seconds


సూడాన్‌లోని ఓ సిరామిక్ ఫ్యాక్టరీలో గ్యాస్ ట్యాంకర్ పేలిన ఘటనలో 18 మంది భారతీయులు సహా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి 130 మంది గాయపడ్డారు. బహ్రి ప్రాంతంలోని సీలా సిరామిక్ ఫ్యాక్టరీలో మంగళవారం పేలుడు జరిగింది. ఈ పేలుడు తర్వాత 16 మంది భారతీయులు కనిపించకుండా పోయారు. తాజా సమాచారం ప్రకారం అధికారికంగా ప్రకటించకపోయినా.. 18 మంది చనిపోయారని భారత ఎంబసీ తెలిపింది.


కనిపించకుండా పోయిన వారిలో కొందరు మరణించి ఉంటారని.. శరీరాలు కాలిపోవడంతో మృతులను గుర్తించడం కష్టంగా మారిందని భారత ఎంబసీ వెల్లడించింది. 24 గంటల హాట్ లైన్ +249-921917471ను ఏర్పాటు చేశామని విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు.

పేలుడులో గాయపడి హస్పిటల్లో చికిత్స పొందుతున్న, కనిపించకుండా పోయిన భారతీయుల వివరాలను భారత ఎంబసీ బుధవారం విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం ఏడుగురు హాస్పిటల్ పాలయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ఘటన నుంచి తప్పించుకున్న 34 మంది భారతీయులు సాలోమి సిరమిక్స్ ఫ్యాక్టరీ నివాస సముదాయాల్లో ఉన్నారు. పేలుడు జరిగిన ఫ్యాక్టరీలో ఎలాంటి భద్రతా చర్యలు పాటించలేదని, పేలుడు పదార్థాలను కూడా నిల్వ చేశారని… దీని వల్ల మంటలు వ్యాపించాయని సూడాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని స్పష్టం చేసింది.





Source link

0 0
Next Post

Pawan Kalyan- The New Indian Express

By Express News Service TIRUPATI/VIJAYAWADA: Sending clear indications that he is inclined towards the BJP, Jana Sena Party chief Pawan Kalyan, who supported the BJP-TDP alliance in the 2014 elections, on Wednesday said that he never himself distanced from the BJP but he only differed with the saffron party on […]