srisailam dam gates opened: కృష్ణమ్మకు భారీ వరద.. శ్రీశైలం గేట్లు ఎత్తి నీటి విడుదల, ఈ సీజన్లో రెండోసారి – krishna floods: srisailam dam gates opened for the second time in this season

admin
Read Time2 Minute, 49 Second


ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఆల్మట్టి 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి నుంచి భారీగా వరద వస్తుండటంతో.. శ్రీశైలం డ్యాం 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తడం రెండోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 3.29 లక్షలుగా ఉంది. ఔట్‌ఫ్లో 2.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ డ్యామ్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 211 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుపుతున్నారు.


సరిగ్గా నెల రోజుల క్రితం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం 4 గేట్లను మాత్రమే ఎత్తగా.. వరద ప్రవాహం ఎక్కువగా ఉంటే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నీరంతా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో చేరుతోంది.

ఎగువ నుంచి వరద ప్రవాహం మరి కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో.. ఈ వారంతంలోగా నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉంది. మొహర్రం, వీకెండ్ సందర్భంగా పర్యాటకులు ఈ రెండు జలాశయాల అందాలను ఆస్వాదించడానికి బారులు తీరే ఛాన్స్ ఉంది.





Source link

0 0
Next Post

KCR Takes Aim At Centre For 20% Cut

Hyderabad:  Telangana Chief Minister K Chandrashekar Rao presented a bleak picture of not just the state’s economy but that of the country as he presented his annual budget proposals, paring spending by nearly 20 per cent from what was presented in the vote-on-account budget in February. “I regret that I […]