srikakulam ysrcp leader attack : మహిళా సీఐపై చేయిచేసుకున్న వైసీపీ నేత.! శ్రీకాకుళంలో ఘటన – lady ci thrashed by ysrcp leader in srikakulam district

admin
Read Time3 Minute, 2 Second


ఏపీలో స్థానిక సమరంలో అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. అధికార వైసీపీ నేత ఏకంగా మహిళా సీఐపై చేయిచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. నామినేషన్ల సందర్భంగా శ్రీకాకుళం వన్‌టౌన్‌ సీఐ లలితపై సరుబుజ్జిలి మాజీ జడ్పీటీసీ లక్ష్మీనర్సమ్మ చేయిచేసుకున్నారు. క్యూలో రమ్మన్నందుకు సీఐపై దాడి చేసినట్లు తెలుస్తోంది.


ఏకంగా సీఐ స్థాయి అధికారిపై చేయిచేసుకోవడంతో వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందనే విషయమై దర్యాప్తు చేపట్టారు. అయితే ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయలేదని.. అధికార పార్టీకి చెందిన నేత కావడంతోనే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెనకాడుతున్నారని స్థానిక ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read:
మాచర్ల దాడి నిందితుల అరెస్ట్.. హోం మంత్రి చురకలు

ఏపీలో స్ధానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అక్కడక్కాడా చెదురుమదులు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మాచర్లలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్లపై దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డీజీపీ గౌతం సవాంగ్ సైతం దాడి ఘటనపై స్పందించారు. తక్షణం ఐజీ, ఎస్పీలను అక్కడికి పంపించి పరిస్థితిని సమీక్షించారు.

Crime News:
భార్యని ఫ్రెండ్స్ గదిలోకి పంపి.. రేప్ చేస్తుండగా వీడియోలు తీసి.. కీచక భర్త ఘాతుకం





Source link

0 0
Next Post

coronavirus a pandemic : కరోనా వైరస్ ఒక మహమ్మారి.. డబ్ల్యూ‌హెచ్‌ఓ కీలక ప్రకటన - who declares coronavirus crisis pandemic

కరోనా వైరస్ పలు దేశాల్లో తీవ్రమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ‌హెచ్‌ఓ) కీలక ప్రకటన చేసింది. కోవిడ్-19ను మహమ్మారిగా ప్రకటించింది. చైనా వెలుపల కరోనా వైరస్ కేసులు గత రెండు వారాల్లో 13 రెట్లు పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ డాక్టర్ టెడ్రాస్ అద్నామ్ గ్యాబ్రియేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ నియంత్రణలో నిష్క్రియాపరత్వం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్ […]