Shaheen Bagh : డ్రైనేజీలో కండోమ్‌లు.. ఢిల్లీ షహీన్‌బాగ్‌లో దొరికినవేనా? – old photo of vietnam shared claiming condoms found in shaheen bagh

admin
Read Time5 Minute, 1 Second


పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీకి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలతో ఢిల్లీలోని షహీన్‌బాగ్ పేరు గత కొంత కాలంగా దేశంలో మార్మోగిపోతున్న విషయం తెలిసిందే. గత రెండు నెలలుగా ఇక్కడ మహిళలు చేస్తున్న ఆందోళనలు దేశం దృష్టిని ఆకర్షించాయి. అయితే.. మంగళవారం (ఫిబ్రవరి 18) అనూహ్యంగా ఓ వివాదాస్పద అంశం తెరపైకి వచ్చింది.


అసలేం ప్రచారం జరుగుతోంది?

షహీన్‌బాగ్‌ ప్రాంతానికి సంబంధించినదిగా పేర్కొంటూ భారీ సంఖ్యంలో కండోమ్‌లు ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభు సాగర్ అనే నెటిజన్ మంగళవారం (ఫిబ్రవరి 18) దీన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. షహీన్‌బాగ్‌లో ఓ డ్రైనేజీ శుభ్రం చేస్తుండగా.. భారీ సంఖ్యలో కండోమ్‌లు పారిశుద్ధ్య కార్మికుల కంటబడ్డాయని అతడు హిందీలో కామెంట్ పెట్టాడు. మీకు ఆధారాలు కావాలంటే పంపిస్తా అని పేర్కొన్నాడు.

ఫేస్‌బుక్ పోస్టు

ఈ ఫోటో పోస్టు చేసిన వెంటనే వైరల్‌గా మారింది. అనేక మంది రీట్వీట్లు చేశారు. మరికొంత మంది నెటిజన్లు కూడా ఇలాంటి కామెంట్లే పెడుతూ ఈ ఫోటోను షేర్ చేశారు. వాట్సాప్‌లో కూడా ఈ ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది.

షహీన్‌బాగ్‌పై పోస్టు

వాస్తవం ఏంటి?

షహీన్‌బాగ్ డ్రైనేజీలో గుర్తించినట్లుగా చెబుతున్న కండోమ్‌లకు సంబంధించిన ఈ ఫోటో ఇప్పటిది కాదు. నాలుగేళ్ల కిందటి ఫోటో ఇది. పైగా ఇది అసలు మనదేశానికి సంబంధించి కూడా కాదు. షహీన్‌బాగ్‌తో అసలు ఏమాత్రం సంబంధం లేదు.

ఇంటర్నెట్‌లో సింపుల్ రివర్స్ ఇమేజ్ పద్ధతిలో సెర్చ్ చేసినా.. ఈ ఫోటోకు సంబంధించిన వివరాలు వస్తున్నాయి. వియత్నాంకు చెందిన ఓ వెబ్‌సైట్ 2016లో ప్రచురించిన ఓ వార్తా కథనంలో ఈ ఫోటోను ఉపయోగించారు. గూగుల్ ట్రాన్స్‌లేషన్ సాయంతో ఈ వార్తా కథనం వివరాలను శోధించగా.. వియత్నాం బాలుర హాస్టళ్లలో పరిస్థితి గురించి వివరిస్తూ రాసిన కథనమని తెలుస్తోంది. ఆ కథనాన్ని కూడా ప్రశ్నార్థకపూర్వక హెడ్డింగ్‌తో ప్రచురించారు.

Read this in English

పురుషుల హాస్టల్ సమీపంలోని చెత్తకుప్పలో విద్యార్థులకు సంబంధించిన ఈ సీక్రెట్ బయటపడింది అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఒరిజినల్ ఫోటోకు ఎలాంటి వాటర్ మార్క్ లేదు. టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ బృందం పరిశీలనలో ఈ కీలక వివరాలు బయటపడ్డాయి.

మరో పోస్టు

చివరికి తేలింది ఇదే..

2016లో ఇంటర్నెట్‌లోకి వచ్చిన కండోమ్‌ల ఫోటోను తాజాగా సర్క్యులేట్ చేస్తూ షహీన్‌బాగ్‌పై వదంతులను వ్యాప్తి చెందిస్తున్నారు. అక్కడ నిరసన చేస్తున్న మహిళల ప్రతిష్టను భంగం కలిగించే దురుద్దేశంతో ఇలా చేస్తున్నట్లు భావించవచ్చు. షహీన్‌బాగ్‌లోని డ్రైనేజీలో కండోమ్‌లు బయటపడ్డాయనే వార్త పూర్తి అవాస్తవం.

Also Read:
చెమటలా కారుతున్న రక్తం.. వింత జబ్బు, కోటి మందిలో ఒకరికి

Must Read:
ఏప్రిల్ 1 నుంచి దేశంలో క్లీనెస్ట్ పెట్రోల్.. రేట్లు పెరుగుతాయా?

Source link

0 0
Next Post

Amaravati-Vizag passengers can now ‘cruise’ in comfort

The Andhra Pradesh State Road Transport Corporation (APSRTC) is planning to increase the connectivity between Amaravati and Visakhapatnam, the proposed legislative and executive capitals respectively, by operating Volvo buses under the brand name “Dolphin Cruise”. About 16 such services would be operated, said its Vice-Chairman and Managing Director (VC&MD) Madireddy […]