samsung galaxy m30s gomonster challenge: #GoMonster ఛాలెంజ్: డాంగ్ లోయ నుంచి కచ్ వరకు సూర్యుడిని వెంటాడే సవాల్ స్వీకరించిన అర్జున్ వాజ్‌పేయి – mountaineer sun chaser arjun vajpai accepts the gomonster one charge challenge from dong valley to kutch

admin
Read Time59Seconds


Samsung వారి #GoMonster ఒకసారి ఛార్జింగ్ సవాల్ ఇప్పుడు దేశమంతటా చర్చనీయమైంది. ఇందులో ఉండే అత్యద్భుత ఫీచర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల నటుడు అమిత్ సాధ్ చేసిన థ్రిలింగ్ Monster సాహస యాత్ర ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో చూసే ఉంటారు. ఒకసారి మాత్రమే ఛార్జింగ్ చేసిన 6000mAh బ్యాటరీ గల Samsung Galaxy M30s ఫోనుతో లేహ్ నుంచి పాన్ గాంగ్, అక్కడి నుంచి హన్లేకి కేవలం చేసిన థ్రిల్లింగ్ యాత్రను అమిత్ సాధ్ విజయవంతంగా పూర్తి చేయడం తెలిసిందే.

హిమాలయాల మీదుగా సాహసయాత్ర పూర్తిచేసిన అమిత్ సాధ్.. మరో థ్రిల్లింగ్ సవాల్‌ను సాహసికుడు అర్జున్ వాజ్‌పేయికి విసిరారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని కోరారు. 17 ఏళ్ల వయస్సులోనే ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరమైన ఎవరెస్టుని అధిరోహించిన వాజ్‌పేయికి సాహసాలంటే పిచ్చి. అందుకే, అర్జున్ ఈ సవాల్ స్వీకరించడానికి ఒప్పుకున్నారు. Samsung వారి #GoMonster రెండో దశ ఛాలెంజ్‌లో ఒకసారి మాత్రమే ఛార్జింగ్ చేసిన ఫోన్‌తో సాహసయాత్ర చేయనున్నారు. ఈసారి మరింత ఉత్కంఠభరితంగా ఈ సవాల్ ఉండనుంది!

అర్జున్‌ సాహసాలంటే ప్రాణమిస్తాడు. 2018లో అర్జున్ కాంచనగంగ పర్వతాన్ని అధిరోహించారు. ఈ రికార్డుతో అర్జున్.. 8,000 మీటర్ల కంటే ఎత్తైన ఆరు పర్వతాలను అధిరోహించిన అతి పిన్న భారతీయుడిగా గుర్తింపు పొందాడు. సాహసమే అతడి ఊపిరి అని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం. అర్జున్ ఇప్పుడు స్వీకరించిన సవాల్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ యాత్ర చాలా ఉత్కంఠభరితంగా.. వినోదాత్మకంగా సాగుతుంది. Samsung వారి #GoMonster సవాల్‌లో భాగంగా ఒకేసారి మాత్రమే ఛార్జింగ్ చేసిన ఫోన్‌తో అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు పర్వతాల నుంచి పశ్చిమ తీరంలోని గుజరాత్ వరకు సూర్యుడిని వెంటాడనున్నాడు. ఈ యాత్ర ఆద్యాంతం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సమయంతో పోటీగా సాగే పోరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేపథ్యంలో అర్జున్ ఈ వీడియో సందేశం ఇచ్చారు.

కేవలం ఒక్కసారి మాత్రమే ఛార్జింగ్ చేసిన Samsung Galaxy M30s ఫోన్‌తో 3,700 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించడం అంటే మాటలు కాదు. ఈ సవాల్ ప్రకారం.. అర్జున్ అరుణాచల్ ప్రదేశ్‌లోని డాంగ్ లోయలో సూర్యోదయంతో యాత్ర మొదలుపెట్టి.. గుజరాత్‌లోని అరేబియన్ సముద్రంలో సూర్యాస్తమయాన్ని చూడాల్సి ఉంటుంది. ఇది అర్జున్‌కు మాత్రమే కాదు.. భారీ 6000mAh బ్యాటరీకి కూడా పెద్ద సవాలే అనిపిస్తోంది. త్వరలో విడుదల కానున్న Samsung Galaxy M30s ఫోన్ సాంకేతిక ప్రపంచాన్ని తుఫానులా ముంచెత్తే.. అద్భుతమైన ఫీచర్లతో నిండి ఉంది. విడుదల చేయడానికి ముందు సెలబ్రిటీల ద్వారా ఈ ఫోన్ శక్తిని పరీక్షించేందుకు ఈ సాహస ప్రయాణాలకు శ్రీకారం చుట్టింది.

Samsung Galaxy M30s ఫోనుతో భారతదేశ తూర్పు దిక్కున ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని చిట్ట చివరి గ్రామం డాంగ్ లోయలో అర్జున్ ప్రయాణం మొదలవుతుంది. దేశంలో తొలి సూర్యోదయాన్ని చూసే ప్రాంతాల్లో డాంగ్ ఒకటి. ఇది ఎంత శివారు ప్రాంతమంటే శాటిలైట్ మ్యాప్‌లో ఒక ఆకుపచ్చ పట్టీలా మాత్రమే కనిపిస్తుంది.

అర్జున్ తన ప్రయాణంలో ఎందో ధైర్యంగా ప్రమాదకర పర్వతాలు, జలపాతాలతో ధ్వంసమైన రోడ్లను అధిగమిస్తూ సాగాలి. చెట్లకొమ్మలతో వేలాడే వంతెనలను సైతం దాటాల్సి ఉంటుంది. అర్జున్ ఒకసారి మాత్రమే ఛార్జింగ్ చేసిన ఫోన్ సాయంతో చేపట్టిన ఈ #GoMonster సవాల్‌లో ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఈ యాత్రను అర్జున్ కాలి నడకతోనే పూర్తి చేయాలి. కేవలం పబ్లిక్ రవాణా వాహనాల్లో మాత్రమే ప్రయాణించాలి. అంటే.. అతని షెడ్యూల్‌లో నిర్ణయించిన సమయం కంటే ఎక్కువ సమయం ప్రయాణానికే పడుతుంది. ఫోను బ్యాటరీ మరింత తగ్గిపోతుంది. కేవలం ప్రయాణం మాత్రమే కాదు. ఈ సవాల్‌లో భాగంగా అర్జున్ తనకు కనిపించే ప్రకృతి అందాలను సైతం ఫోటోలు, వీడియోల రూపంలో ఫోనులో బంధిస్తాడు. అంటే.. ఫోనును అవసరం కంటే ఎక్కువగా వాడే పరిస్థితి కనిపిస్తుంది

డాంగ్‌లో సూర్యోదయం చూసిన తర్వాత అర్జున్ వాలోంగ్‌కి ట్రెక్ చేస్తారు. అక్కడి నుంచి బురదతో నిండిన రోడ్లపై ప్రయాణించే పబ్లిక్ రవాణా వాహనంలో నమ్సాయ్‌కి చేరుకుంటారు. అస్సాంలోని డిబ్రూఘడ్‌కి వరకు సాగే ఈ సాహసయాత్రలో అతను విభిన్న ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తాడు. అక్కడి నుంచి అహ్మదాబాద్ వెళ్లే విమానాన్ని అందుకోడానికి ప్రయత్నించాలి. ఏ మాత్రం ఆలస్యమైనా అతడు పరిగెడుతూనే అక్కడికి చేరుకోవల్సి వస్తుంది. అహమ్మదాబాద్ చేరుకున్న తర్వాత పబ్లిక్ రవాణా వాహనంలో అరేబియా సముద్రంలో సూర్యాస్తమయం కోసం కచ్‌కి కష్టపడి చేరుకోవాలి. ఈ సందర్భంగా అర్జున్ కొన్ని రోజులపాటు ఒకసారి మాత్రమే ఛార్జింగ్ చేసిన ఫోన్‌ను ఆపకుండా వాడుతూనే ఉండాలి.

ఈ ప్రయాణంలో మన భారీ 6000mAh బ్యాటరీ ఫోన్ ఎంతో కీలకం కానుంది. ఒక వైపు ఫోన్‌గా మాత్రమే కాకుండా.. ఒక కెమేరాగా, అతని దిశనిర్దేశం చేసే మార్గదర్శిగా ఎన్నో రకాలుగా Samsung Galaxy M30s ఫోన్ ఉపయోగపడాల్సి ఉంది. అర్జున్‌ను దేశంలోని తూర్పు వైపు నుంచి పశ్చిమ తీరం వైపు చేర్చటంలో ఈ ఫోను అనే బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ ఫోనులో భారీ 6000mAh బ్యాటరీ మాత్రమే కాదు, వెనుక వైపు ట్రిపుల్ కెమేరా, ఇప్పటివరకు నాలుగు Galaxy M సీరిస్ స్మార్ట్‌ఫోన్లలో చూడని సరికొత్త Exynos ప్రాసెసర్ ఇందులో ఉన్నాయి. ఈ సరికొత్త Samsung Galaxy M30s నేటి వినియోగదారులకు కావాల్సినవన్నీ అందిస్తోంది. ఈ Monster ఫోన్ అమ్మకాల సమాచారాన్ని
Samsung.com
లేదా
Amazon
వెబ్ సైట్లను గమనిస్తూ ఉండండి!

అర్జున్ సాహసయాత్రలో ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవన్ని ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్ మిస్ అవుతారు. కాబట్టి.. Samsung Galaxy M30sతో అర్జున్ విభిన్న సమయాలు, విభిన్న ప్రదేశాలు, విభిన్న భౌగోళిక ప్రాంతాలను దాటుకుని సూర్యుడిని వెంటాడే ఈ monster ప్రయాణంలో విజయం లభిస్తుందో లేదో తెలుసుకోడానికి వేచి చూద్దాం.

గమనిక : ఈ ఆర్టికల్ Samsung తరఫున టైమ్స్ ఇంటర్నెట్ స్పాట్ లైట్ బృందం వారిచే ప్రచురితమైంది.

Source link

0 0
Next Post

Six Children Drown While Enacting Ganesh Chaturti Immersion In Karnataka

The bodies of the children had been recovered and shifted to a hospital : Police (Representational) Bengaluru:  A mock Ganesh idol immersion turned fatal for six children as they drowned in a tank while enacting it on Tuesday at a village in Kolar district of Karnataka, police said. As Tuesday […]