republic day parede 2020 : ఢిల్లీ: ఘనంగా 71వ గణతంత్ర వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ఆర్మీ ఆయుధ వ్యవస్థ – president ramnath kovind unfurls national flag in republic day celebrations at rajpath in delhi

admin
Read Time45Seconds


దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో 71 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెసియస్ బొల్సొనారో హాజరయ్యారు. తొలుత ఇండియా గేట్ వద్ద నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు నివాళులర్పించారు. స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి సైనికులకు దేశ ప్రజల తరఫున ప్రధాని శ్రద్ధాంజలి ఘటించారు.


ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ముకుంద్ నరవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాజ్‌పథ్‌కు మోదీ చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ముఖ్య అతిథి బ్రెజిల్ అధ్యక్షుడి బొల్సొనోరోలకు మోదీ స్వాగతం పలికారు. వారితో కలిసి పరేడ్‌ను తిలకిస్తూ మోదీ అభివాదం చేశారు.

తర్వాత జాతీయ జెండాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎగురవేసి గౌరవందనం చేశారు. గణతంత్ర వేడుకలకు ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ తదితరులు తదితరులు హాజరయ్యారు.

ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌కు కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ అసిత్ మిస్త్రీ నేతృత్వం వహించారు. అతి విశిష్ట సేవా పతకం, సేన మెడల్, విశిష్ట సేవా మెడల్ గ్రహీత అయిన అసిత్ మిస్త్రీ ఢిల్లీ ప్రాంత ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

పరేడ్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ఆర్మీ ఏవియేషన్ విభాగానికి చెందిన రుద్ర, ధ్రువ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు, భీష్మ యుద్ధ ట్యాంకులు, ఇన్‌ఫ్రాంట్రీ కంబాట్ వెహికల్స్, బీఎంపీ-2, వజ్ర-టీ, ధనుష్ రైఫిల్ వ్యవస్థ, ఇటీవల ఆర్మీలో కొత్తగా చేరిన షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్ వ్యవస్థ, సర్వత్రా బ్రిడ్జ్ సిస్టమ్, ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించేగలిగే శాటిలైట్ టెర్మినల్, ఆకాశ్ ఆయుధాలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి. మొత్తం ఆరు కవాతు బృందాలు ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి.

Source link

0 0
Next Post

Low rates leave social forestry planters in despair

Peasants in Prakasam district are in for a serious trouble as the prices of subabul, eucalyptus and casuarina logs continue to rule low despite increase in demand for paper. Taking stock of the situation, farmer leaders at a meeting chaired by Prakasam District Development Forum president Ch. Ranga Rao here […]