rajasthan infants death : 2 రోజుల్లో 10 మంది శిశువుల మృత్యువాత! ఈ నెలలోనే 77 మంది! – rajasthan hospital death bell: 10 infants died in 2 days

admin
Read Time45Seconds


రాజస్థాన్‌లోని ఓ ఆస్పత్రిలో కేవలం రెండు రోజుల్లోనే 10 మంది శిశువులు మృత్యువాత పడటం సంచలనం రేపుతోంది. అప్పుడే కళ్లు తెరిచిన చిన్నారులు అంతలోనే శాశ్వత నిద్రలోకి జారుకోవడం కలకలం రేపుతోంది. కోటలోని జేకే లాన్‌ ఆస్పత్రిలో డిసెంబర్ 23న ఆరుగురు, డిసెంబర్ 24న నలుగురు శిశువులు మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో ఐదుగురు ఆడ శిశువులుండగా, మిగతా ఐదుగురు మగ శిశువులు ఉన్నారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువులు మరణించారని బాధితులు ఆసుపత్రి ఎదుట ఆందోళనలు చేపట్టారు.


Also Read: ఆశ్రయమిచ్చిన యజమాని తొమ్మిదేళ్ల కూతురిపై రేప్!

ఈ ఘటనపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందుకు ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఈ దుర్ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెండ్‌ డాక్టర్ హెచ్‌ఎల్‌ మీనా మాట్లాడుతూ.. సాధారణంగా ఆస్పత్రిలో రోజుకు ఒకటి, రెండు మరణాలు సంభవిస్తూ ఉంటాయని, కానీ రెండు రోజుల్లో 10 మంది చిన్నారులు మరణించడం బాధాకరమన్నారు. కానీ ఇదేమీ అసాధారణమేమీ కాదని చెప్పుకొచ్చారు.

శిశువుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కొందరిని ఇతర ఆస్పత్రులకు తీసుకెళ్లాలని కోరినట్లు పేర్కొన్నాడు. అయితే ఆక్సిజన్‌ అందక, ఇన్‌ఫెక్షన్‌ వల్ల, పలు కారణాల రీత్యా శిశువులు పుట్టిన 24 నుంచి 48 గంటల్లోనే మృతి చెందారని ఓ వైద్యుడు తెలిపాడు. కాగా ఇదే ఆస్పత్రిలో డిసెంబర్‌ నెలలోనే ఇప్పటివరకు 77 మంది చిన్నారులు మరణించడం గమనార్హం.

Also Read: పూజారి బరితెగింపు.. మైనర్ బాలికపై అత్యాచారం





Source link

0 0
Next Post

kerala sex racket : ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యకర్తల అంతర్రాష్ట్ర సెక్స్ రాకెట్..! - kerala police filed chargesheet against 13 accused including kiss of love activists on sex racket case

నాలుగేళ్ల క్రితం చేధించిన అంతర్రాష్ట్ర సెక్స్ రాకెట్‌పై ఎట్టకేలకు కేరళ పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. ‘ఆపరేషన్ బిగ్ డాడీ’లో భాగంగా 13 మందిని నిందితులుగా గుర్తించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారిపై చార్జిషీటు ప్రవేశపెట్టారు. నిందితుల్లో 2014లో సంచలనం సృష్టించిన ‘కిస్ ఆఫ్ లవ్’ (ప్రేమికులపై ఛాందసవాదుల బహిరంగ దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టారు) ఉద్యమ వ్యవస్థాపకుల్లో ముఖ్యులైన రేష్మి నాయర్, రాహుల్ పశుపాలన్ కూడా […]