Raja Singh: ‘అయోధ్య’ను టచ్ చేస్తే.. 40 వేల ఆలయాలు.. లా బోర్డుకు రాజా సింగ్ వార్నింగ్ – if muslim personal law board drags ayodhya issue, hindus will claim 40000 temples says raja singh

admin
Read Time2 Minute, 42 Second


అయోధ్య తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముస్లిం లా బోర్డు నిర్ణయంపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఘాటుగా స్పందించారు. మొఘలుల పాలన కాలంలో 40 వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను నిర్మించారని ఆరోపించారు. హిందువులు వాటన్నింటిని తిరిగి నిర్మించాలని డిమాండ్ చేస్తారన్నారు. ముస్లిం లా బోర్డు సభ్యులు అవినీతిపరులని ఆయన ఆరోపించారు. ఇందులో ఒకరు హైదరాబాద్‌కు చెందిన ద్రోహి కూడా ఉన్నారన్నారు.


ముస్లింలు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని.. రాజా సింగ్ పిలుపునిచ్చారు. అయోధ్య సమస్య 500-600 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందన్నారు. సుప్రీం గొప్ప తీర్పునిచ్చిందన్న ఆయన.. హిందువులు, ముస్లింలు సంతోషంగా ఉన్నారన్నారు.

భారత ముస్లింలు ఒక వైపు ఉంటే.. ముస్లిం లా బోర్డు మరోవైు ఉందని ఆరోపించారు. ఈ సమస్యకు ఇక్కడితో ముగింపు పలకాలని ఆయన బోర్డును కోరారు.

‘‘చరిత్రేంటో మీకు తెలుసు.. తైమూర్, మహ్మద్ గజినీ, టిప్పు సుల్తాన్, బాబర్, అల్లావుద్దీన్ చిస్తీ, అహ్మద్ షా, ఔరంగజేబ్ లాంటి పాలకులు ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను నిర్మించారు’’ అని ముస్లిం లా బోర్డును ఉద్దేశించి రాజా సింగ్ వ్యాఖ్యానించారు.





Source link

0 0
Next Post

nizamabad car auto accident: నిజామాబాద్: 5 నిమిషాల్లో గమ్యం.. దూసుకొచ్చిన మృత్యు శకటం.. ఐదుగురి దుర్మరణం - 5 from same village killed as speeding car hits auto-rickshaw at yedapally, nizamabad district

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎడపల్లి మండలం ఠాణాకలాన్‌ శివారు.. అలీసాగర్ వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఢీకొట్టాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో.. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు ఘటనాస్థలిలోనే చనిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు ప్రాణాలు వదలగా.. ఆటో డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతులను బాలమణి, గంగవ్వ, […]