Railway guidelines: నేటి నుంచి 200 ప్రత్యేక రైళ్లు: నిబంధనలివే.. టికెట్లు కావు, కర్ఫ్యూ పాసులు – 200 special trains start operations, over 1.45 lakh passengers to travel on day 1

APNEWS CO
Read Time4 Minute, 8 Second


లాక్‌డౌన్‌తో రెండు నెలలకు పైగా మూగబోయిన ప్రయాణికుల రైళ్లు ఇక మళ్లీ కూతపెట్టడానికి సిద్ధమయ్యాయి. సోమవారం (జూన్ 1) ఉదయం నుంచి రైల్వే శాఖ 200 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా రైళ్ల రాకపోకలకు అనుమతి.. ఇవ్వడంతో జూన్ 1 నుంచి 200 పాసింజర్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం ఒక్క రోజే దాదాపు 1.45 లక్షల మంది ఈ రైళ్లలో ప్రయాణించనున్నారు. ఇప్పటివరకూ 25,82,671 మంది ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకున్నట్లు రైల్వే శాఖ ఆదివారం తెలిపింది.

వలస కార్మికుల కోసం ఇప్పటికే శ్రామిక్ రైళ్లను ప్రారంభించిన రైల్వే శాఖ.. ఆ రైళ్లు మరికొన్ని రోజులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా లాక్‌డౌన్‌లో ఇచ్చిన సడలింపుల మేరకు మే 12 నుంచి 30 ఏసీ ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ నడుపుతోంది. వీటికి అదనంగా నేటి నుంచి మరో 200 రైళ్లను నడపనుంది.

రైళ్లలో ప్రయాణానికి సంబంధించి రైల్వే శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి:
* ప్రయాణికులు గంటన్నర (90 నిమిషాల) ముందే రైల్వే స్టేషన్ చేరుకోవాలి.
* ప్రయాణికులు మాస్కులు ధరించాలి. భౌతిక దూరం సహా కరోనా కట్టడి కోసం నిర్దేశించిన నియమాలను విధిగా పాటించాలి.
* ప్రయాణికులతో పాటు కుటుంబసభ్యులను గానీ, బంధువులను గానీ స్టేషన్‌లోని అనుమతించరు. ఫ్లాట్‌ఫాం టికెట్ల విక్రయాలు ఉండవు.
* స్టేషన్లలో పార్కింగ్‌కు అనుమతి లేదు.
* రైల్లోని ప్రతి బోగీలో ఆర్పీఎఫ్ ఎస్కార్‌ ఉంటుంది. ప్రయాణికులు తాగునీరు, ఆహారం, వైద్య సాయం తదితర ఎలాంటి సాయం కావాలన్నా ఎస్కార్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలి.
* కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిబంధనల మేరకు రైల్వే టికెట్లను కర్ఫ్యూ పాసులుగా పరిగణిస్తారు.
* టికెట్ కన్ఫార్మ్ అయిన ప్రయాణికులను మాత్రమే స్టేషన్ ప్రాంగణంలోకి, ప్లాట్‌ఫాం పైకి అనుమతిస్తారు.
* కూలీలను అనుమతించరు. ప్రయాణికులు తమ లగేజీ బ్యాగులను వారే మోసుకెళ్లాల్సి ఉంటుంది.
* థర్మో స్కానింగ్ చేసిన తర్వాత మాత్రమే ప్రయాణికులను స్టేషన్‌లోకి అనుమతిస్తారు.
* ప్రయాణికులు గమ్యస్థానం చేరిన తర్వాత అక్కడి ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే.

పరిమిత సంఖ్యలో రైళ్ల రాకపోకలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ మీదుగా 14 రైళ్లు నడవనున్నాయి. విజయవాడ నుంచి ముంబై, భువనేశ్వర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైకి ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ విజయవాడ స్టేషన్‌లో ఏర్పాట్లను పూర్తి చేసింది.

Also Read:కరోనా కేసుల్లో 8వ స్థానానికి ఎగబాకిన భారత్.. రికార్డు స్థాయిలో కేసులు

Must Read:పశ్చిమ తీరం నుంచి మరో తుఫాన్.. జూన్ 3న తీరానికిSource link

0 0
Next Post

australia pm samosas: ScoMosa: మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని ‘హాట్’ గిఫ్ట్ - australia pm scott morrison makes samosas, ahead of videolink meet with pm modi on june 4

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌.. కుక్ అవతారమెత్తారు. అది కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం కావడం గమనార్హం. భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రమైన సమోసాలను తయారు చేశాడు. ఆ సమోసాలను నంజుకోవడానికి మామిడి చట్నీని కూడా రూపొందించడం విశేషం. ‘సండే స్కోమోసా విత్‌ మ్యాంగో చట్నీ’ అంటూ ఆయన ఆదివారం (మే 31) ట్విటర్‌ ద్వారా ఆ ఫోటోలను షేర్‌ చేశారు. భారత ప్రధాని మోదీని ట్యాగ్‌ చేశారు. […]