PV Sindhu : తెలుగు రాష్ట్రాల్లో విరబూసిన ‘పద్మాలు’.. ఐదుగురికి పురస్కారాలు – pv sindhu got padma bhushan award, five telugu’s got padma awards

admin
Read Time1 Minute, 3 Seconds


తెలుగు తేజం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును దేశంలో మూడో అత్యున్నత పురస్కారమైన పద్మ భూషణ్ అవార్డు వరించింది. కేంద్ర ప్రభుత్వం 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో అత్యున్నత ‘పద్మ’ పురస్కారాలను శనివారం ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను మొత్తం 141 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది.


ఇందులో ఏడుగురిని పద్మ విభూషణ్ వరించగా, 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మ శ్రీ అవార్డు వరించాయి. వీరిలో ఐదుగురు తెలుగు వారికి పద్మ అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి పీవీ సింధును పద్మభూషణ్ అవార్డు వరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కళలు విభాగంలో ఎడ్ల గోపాల్‌రావు, దలవాయి చలపతిరావుకు పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. అలాగే తెలంగాణ నుంచి వ్యవసాయం విభాగంలో చింతల వెంకట్ రెడ్డి, లిటరేచర్, ఎడ్యుకేషన్ నుంచి విజయసారథి శ్రీభాష్యంకు పద్మశ్రీ అవార్డు దక్కింది.

సీఎం జగన్ శుభాకాంక్షలు
పద్మభూషణ్ అవార్డు గెలుచుకున్న పీవీ సింధుకు, ఏపీ తరఫున కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న ఎడ్ల గోపాల్‌రావు, దలవాయి చలపతిరావుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు (7) వీరే..

 • జార్జి ఫెర్నాండేజ్ (మరణానంతరం) (బిహార్)- ప్రజా సంబంధాలు
 • అరుణ్ జైట్లీ (మరణానంతరం) (ఢిల్లీ)- ప్రజా సంబంధాలు
 • అనెరూడ్ జుగ్‌నాథ్ జీసీఎస్‌కే (మారిషస్) – ప్రజా సంబంధాలు
 • ఎంసీ మేరీకోమ్ (మణిపూర్)- ఆటలు
 • చెన్నూలాల్ మిశ్రా (ఉత్తరప్రదేశ్)- కళలు
 • సుష్మా స్వరాజ్ (మరణానంతరం) (ఢిల్లీ)- ప్రజా సంబంధాలు
 • విశ్వేషతీర్థ స్వామీజీ (శ్రీ పెజావారా అధోఖాజా మఠం ఉడుపి) (మరణానంతరం)

పద్మ భూషణ్ అవార్డు గ్రహీతలు (16)

 • ఎం. ముంతాజ్‌ (కేరళ) – ఆధ్యాత్మికం
 • సయ్యద్‌ మౌజం అలీ – (బంగ్లాదేశ్‌) (మరణానంతరం)
 • ముజఫర్‌ హుస్సేన్‌ బేగ్‌ – జమ్మూకశ్మీర్‌
 • అజయ్‌ చక్రవర్తి (బెంగాల్‌) – కళలు
 • మనోజ్‌ దాస్‌ (పుదుచ్చేరి) – సాహిత్యం, విద్య
 • బాలకృష్ణ దోశి – (గుజరాత్‌)
 • కృష్ణమ్మల్‌ జగన్నాథన్‌ (తమిళనాడు) – సామాజిక సేవ
 • ఎస్‌సీ జామిర్‌ – (నాగాలాండ్‌)
 • అనిల్‌ ప్రకాశ్‌ జోషి (ఉత్తరాఖండ్‌) – సామాజిక సేవ
 • సేరింగ్‌ లండల్‌ (లద్దాఖ్‌) – వైద్యం
 • ఆనంద్‌ మహీంద్రా (మహారాష్ట్ర) – వాణిజ్యం, పరిశ్రమలు
 • పీవీ సింధూ (తెలంగాణ) – క్రీడలు
 • నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్‌ (కేరళ) ప్రజా సంబంధాలు (మరణానంతరం)
 • మనోహర్‌ పారికర్‌ (గోవా) – మరణానంతరం
 • జగదీశ్‌ సేథ్‌ (అమెరికా) – విద్య, సాహిత్యం
 • వేణు శ్రీనివాసన్‌ – తమిళనాడు (వాణిజ్యం, పరిశ్రమలు)

పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన ప్రముఖులు వీళ్లే..

 • జగదీశ్‌ లాల్‌ అహుజా (పంజాబ్‌) – సామాజిక సేవ
 • జావేద్‌ అహ్మద్‌ తక్ (జమ్మూ కశ్మీర్‌) – దివ్యాంగ బాలల సంక్షేమం
 • మహ్మద్‌ షరీఫ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) – సామాజిక సేవ
 • తులసి గౌడ (కర్ణాటక) – సామాజికసేవ, పర్యావరణం
 • సత్యనారాయణ్‌ (అరుణాచల్‌ప్రదేశ్‌) – సామాజిక సేవ, విద్యా విభాగం
 • అబ్దుల్‌ జబ్బార్‌ (మధ్యప్రదేశ్‌) – సామాజిక సేవ
 • ఉషా కౌమర్‌ (రాజస్థాన్‌) – పారిశుద్ధ్యం
 • పోపట్‌రావ్‌ పవార్‌ (మహారాష్ట్ర) – సామాజిక సేవ, నీటి విభాగం
 • హరికలా హజబ్బా (కర్ణాటక) – సామాజిక సేవ, విద్యా విభాగం
 • అరుణోదయ్‌ మండల్‌ (బంగాల్‌) – వైద్య, ఆరోగ్యం
 • రాధామోహన్‌, సంభవ్‌ సే సంచయ్‌ (ఒడిశా) – సేంద్రియ వ్యవసాయం
 • కుశాల్‌ కన్వర్‌ (అసోం) – పశువైద్యం
 • ఎస్‌. రామకృష్ణన్‌ (తమిళనాడు)- సామాజిక సేవ, దివ్యాంగుల సంక్షేమం
 • సుందరవర్మ (రాజస్థాన్‌) – పర్యావరణం, అడవుల పెంపకం
 • ట్రినిటీ సయూ (మేఘాలయా) – సేంద్రియ వ్యవసాయం
 • రవి కన్నన్‌ (అసోం)- వైద్యం, అంకాలజీ విభాగం

Source link

0 0
Next Post

trs leader suicide attempt : మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి.. టీఆర్ఎస్ అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నం - defeated trs candidate's husband commits suicide attempt in bhupalapalli of telangana

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఘటన భూపాల్‌పల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కారు జోరు కొనసాగినా ఓటమి చెందడంపై తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. గతంలో కౌన్సిలర్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన భార్యను రంగంలోకి దించారు. ఆమె కూడా ఓటమి చెందడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. […]