putalapattu mla: వైసీపీ ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్ – arrest warrant issued against putalapattu mla ms babu in cheq bounce case

admin
Read Time3 Minute, 32 Second


వైసీపీ ఎమ్మెల్యేపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు. ఎమ్మెల్యే ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ కావడంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తనకు చెల్లని చెక్కులు ఇచ్చారని.. న్యాయం చేయాలని కోరారు.

Samayam Telugu | Updated:

హైలైట్స్

  • గతంలో ఒంగోలుకు చెందిన వ్యక్తికి చెక్కులిచ్చిన ఎమ్మెల్యే
  • చెక్ బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించిన బాధితుడు
  • కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ

వైసీపీకి చెందిన చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబుకు షాక్ తగిలింది. చెల్లని చెక్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెక్ కేసు విచారణలో భాగంగా.. ఎమ్మెల్యే కోర్టు వాయిదాలకు వరుసగా హాజరుకానందుకు ఒంగోలు సంచార న్యాయ స్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే బాబుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.


ఎం.ఎస్ బాబు గతంలో ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి చెక్కులు ఇచ్చారట. కానీ ఆ చెక్కులు బౌన్స్‌ కావడంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తనకు చెల్లని చెక్కులు ఇచ్చారని.. న్యాయం చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు వాదనలు వింటోంది. కానీ బాబు మాత్రం విచారణకు గైర్హాజరవుతుండటంతో కోర్టు సీరియస్‌గా స్పందించింది. ఎమ్మెల్యేపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. ఈ వారెంట్ వ్యవహారంపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

 

Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Web Title arrest warrant issued against putalapattu mla ms babu in cheq bounce case

(Telugu News from Samayam Telugu , TIL Network)





Source link

0 0
Next Post

Jute mill issue will be solved in six months: Muttamsetti

Stating that the Chittivalasa jute mill issue will be resolved in six months, Minister of Tourism and Youth Affairs Muttamsetti Srinivasa Rao said the next meeting will be held in the presence of the Labour Minister on July 9 with representatives of the managements and unions participating. Mr. Srinivasa Rao […]