Pawan Kalyan : BJP ముద్దు, సొంత పార్టీ వద్దా..? జనసేనానీ ఇదేమీ..? – janasena chief pawan kalyan following bjp in twitter, but not jana sena

admin
Read Time44Seconds


బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతి రైతులకు మద్దతుగా.. ఇరు పార్టీలు కలిసి ఫిబ్రవరి 2న భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించాయి. రాష్ట్రంలో ఏ కార్యక్రమం నిర్వహించినా రెండు పార్టీలూ కలిసే చేపట్టాలని కూడా తీర్మానించాయి. బీజేపీతో దోస్తీ కుదిరాక పవన్ కళ్యాణ్‌లో దూకుడు పెరిగింది. జగన్ సర్కారు మీద ఆయన ఘాటైన విమర్శలు చేస్తున్నారు. కమలం పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత బయటే కాదు.. సోషల్ మీడియా పరంగానూ జనసేనాని వైఖరిలో మార్పు వచ్చింది.


నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులు అర్పిస్తూ.. ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌ను పవన్ కళ్యాణ్ రీ ట్వీట్ చేశారు. తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతోపాటుగా బీజేపీని ఫాలో అవుతున్నారు. గతంలో ఆయన కేవలం మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను మాత్రమే ట్విట్టర్లో ఫాలో అయ్యేవారు. అనంతరం వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్‌ను ఫాలో అయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మోదీ, అమిత్ షా, భారతీయ జనతా పార్టీ వచ్చి చేరాయి.

పవన్ ఫాలో అవుతున్నది వీరినే..

పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని గమనించారో లేదోగానీ.. తన సొంత పార్టీ జనసేనను మాత్రం ఆయన ట్విట్టర్లో ఫాలో కావడం లేదు. బీజేపీని అనుసరించే ముందు జనసేనను కూడా ఫాలో చేస్తే బాగుండేది. జనసేన మాత్రం ట్విట్టర్లో కేవలం పవన్ కళ్యాణే ఫాలో అవుతుంది. అదే సమయంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్ హ్యాండిల్‌ జనసేనను, చంద్రబాబును ఫాలో అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఫాలో కావడం లేదు.





Source link

0 0
Next Post

rangareddy road accident : తలకిందులైన స్కూల్ ఆటో.. రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం - auto overturns, 15 students injured in rangareddy district

స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటన తెలంగాణలో జరిగింది. ఆ సమయంలో ఆటోలో 15 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఆటో వేగంగా వెళ్తూ ఒక్కసారిగా తలకిందులుగా తిరగబడడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా జిల్లెడ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలోని చౌదర్ గూడ మండలంలోని ప్రశాంత్ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఆటో విద్యార్థులతో వెళ్తూ బోల్తా పడింది. చౌదర్ గూడ నుంచి […]