ongole murder case : ఒంగోలు తల్లీబిడ్డల హత్య కేసులో ఒళ్లు గగుడ్పొడిచే దారుణాలు వెలుగులోకి.. – ongole mother, child murder case: reveals cruel behaviour of husband

admin
Read Time46Seconds


ప్రేమిస్తున్నానంటూ మైనర్ బాలిక వెంట పడ్డాడు. నువ్వు లేకుంటే చచ్చిపోతానంటూ బెదిరించాడు. ప్రేమ పేరుతో నమ్మించి మైనార్టీ తీరకముందే పెళ్లి చేసుకున్నాడు. కాపురం చేసి ఓ బిడ్డ జననానికి కారణమయ్యాడు. కానీ పెళ్లయిన కొద్ది నెలల నుంచే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఘోరంగా హింసించసాగాడు. చివరకు బిడ్డ గొంతు కోసి, భార్య తలను బండకేసి మోది అంతమొందించాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులో తల్లీబిడ్డలను హత్య చేసి తగులబెట్టిన కోటేశ్వరరావు దారుణాలివి! నిందితుడి అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న కొద్దీ.. కోటేశ్వరరావు రూపంలో నరరూప రాక్షసుడు సంచరిస్తున్నాడని చెప్పక తప్పదు.


మనిషి రూపంలో ఉన్న అనుమాన పిశాచి..
మైనర్ బాలిక అయిన శ్రీలక్ష్మిని ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకున్న కోటేశ్వరరావు.. ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తూ సమీపంలోని ముక్తినూతలపాడులో కాపురం పెట్టాడు. అయితే పెళ్లయిన కొంత కాలం నుంచి నిత్యం అనుమానిస్తూ ఘోరంగా హింసించేవాడు. కోటేశ్వరరావుకు భార్యపై అనుమానం ఏ స్థాయిలో ఉండేదంటే ఆమె జడను సైతం ఇంట్లోనే కత్తిరించేశాడు. ఈ నెల 2, 3 తేదీల్లో భార్యను తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి వెళ్లిపొమ్మంటూ రూ. 50 ఇచ్చి నెల్లూరు బస్టాండ్‌లో వదిలేశాడు. అయితే శ్రీలక్ష్మి దెబ్బలు తట్టుకోలేక వైద్యుడికి చూపించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లింది.

Also Read:
తల్లీబిడ్డ దారుణ హత్య.. అయ్యప్ప స్వాముల సాక్ష్యంతో హంతకుడు వెలుగులోకి..

భార్య ఎదుటే పసిబిడ్డ హత్య
వాస్తవానికి కోటేశ్వరరావు స్వగ్రామం అద్దంకి పట్టణంలోని దామావారిపాలెం. అతను 6వ తరగతి నుంచి పేర్నమిట్ట సుబ్బయ్య స్కూల్‌‌లో చదువుకున్నాడు. అతని అమ్మమ్మ ఊరు పెద్ద కొత్తపల్లి. హత్య జరిగిన ప్రదేశం కూడా ఈ పంచాయతీ పరిధిలోనిదే. దీంతో ఈ మార్గంపై నిందితుడికి గట్టి పట్టుంది. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రికి వచ్చిన భార్యను నమ్మకంగా బైక్ ఎక్కించుకుని డొంక మార్గం నుంచి పయనమైనట్లు తెలిసింది. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుగా చిన్నారి వైష్ణవి (11 నెలలు)ని కత్తితో గొంతు కోసి చంపి, ఆ తర్వాత భార్య శ్రీలక్ష్మిని బండరాయి కేసి మోది దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది.

నింపాదిగా విధులకు హాజరు
ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో చివరకు నిందితుడిని పట్టిస్తే రూ. లక్ష బహుమానం కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కోటేశ్వరరావు సెల్‌‌ఫోన్ నంబర్‌ తెలుసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సాధారణంగా ఎలాంటి నేరస్తుడైనా ఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతం నుంచి సుదూరంగా పారిపోతాడు. కానీ, హత్య జరిగిన తర్వాత నిందితుడు నింపాదిగా విధులకు హాజరైనట్లు తెలిసి పోలీసులు నిర్ఘాతపోయారు.

Also Read: బంధాన్ని కూల్చేసిన మౌఢ్యం.. మాజీ భార్యను మాంత్రికుడి వద్దకు తీసుకెళ్తే..

తల్లీబిడ్డల నామరూపాల్లేకుండా చేయాలనీ..
భూమ్మీద తల్లీబిడ్డల నామరూపాల్లేకుండా చేయాలనుకున్న కోటేశ్వరరావు భార్య, పిల్లల ఫొటోలు సైతం ఎవరికీ దొరక్కుండా తగులబెట్టేశాడు. అయితే చట్టుపక్కల వారు తల్లీబిడ్డలను తీసిన ఫొటోలు మీడియా చేతికి చిక్కాయి. దీంతో హత్యకు గురైన తల్లి శ్రీలక్ష్మి, బిడ్డ వైష్ణవిలు ఎలా ఉంటారో అందరికీ తెలిసింది.

గురువారంతో శ్రీలక్ష్మికి 18 ఏళ్లు..
హత్యకు గురైన శ్రీలక్ష్మికి గురువారంతో 18 ఏళ్లు నిండాయి. కానీ ఆమె మైనార్టీ తీరకుండానే వివాహం కావడం.. ఒక బిడ్డకు తల్లి కావడం.. చివరకు భర్త చేతిలో 9 రోజుల క్రితమే దారుణ హత్యకు గురికావడం.. వంటి వివరాలు ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తోంది. చివరకు పోలీసులు, దళిత సంఘాల చొరవతో ఒంగోలులోని స్థానిక దశరాజుపల్లి రోడ్డులోని హిందూ శ్మశాన వాటికలో తల్లీబిడ్డల మృతదేహాలను ఖననం చేశారు. ఒంగోలు ప్రభుత్వ వైద్యశాల నుంచి హిందూ శ్మశాన వాటిక వరకు మృతదేహాలను తీసుకెళ్తున్నారని తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి కంట తడి పెట్టారు.

Also Read:
ఇష్టం లేని పెళ్లి చేశారని.. వరుడి బలవన్మరణం!

Source link

0 0
Next Post

harsha kumar arrested : అజ్ఞాతం వీడిన హర్ష కుమార్.. అరెస్ట్ చేసిన రాజమండ్రి పోలీసులు.. - rajahmundry police arrests amalapuram former mp harsha kumar

అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 75 రోజులపాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన.. శుక్రవారం రాజమండ్రి వెళ్లారు. కాసేపటికే ఆయన్ను త్రిటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జ్యుడిషియల్ సిబ్బందిని దూషించిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. హర్ష కుమార్‌పై 353, 323, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్యపరీక్షల అనంతరం పోలీసులు మాజీ ఎంపీని రాజమండ్రి 7వ అదనపు కోర్టు జడ్జి ఎదుట […]