oman sultan demise : ఒమన్ సుల్తాన్ మరణం.. భారత్‌‌లో అధికారిక సంతాప దినం – state mourning on monday throughout india over oman sultan demise

admin
Read Time5 Minute, 37 Second


ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయిద్ మృతికి సంతాపంగా భారత్ సోమవారం అధికారికంగా సంతాప దినాన్ని పాటించనుంది. ఖబూస్ 79 ఏళ్ల వయసులో పెద్ద పేగు కేన్సర్ కారణంగా జనవరి 10న కన్నుమూశారు. సుదీర్ఘ కాలంపాటు దేశాన్ని పాలించిన పశ్చిమాసియా నేతగా ఆయన గుర్తింపు పొందారు. ఓ దేశాధినేత మరణానికి మరో దేశం అధికారికంగా సంతాపం దినాలను పాటించడం అరుదైన విషయం. గొప్ప మానవతావాదైన ఒమన్ సుల్తాన్ మరణానికి సంతాపంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.


అధికారిక సంతాప దినం సందర్భంగా… సోమవారం జాతీయ జెండాను సగం వరకు ఎగరేస్తామని హోం శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. సంతాప దినం విషయమై హోం శాఖ.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం పంపింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించడం, దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తామని అమిత్ షా ప్రకటించడంతో.. మోదీ సర్కారు పట్ల ముస్లింల్లో వ్యతిరేకత పెరిగిందని భావన వ్యక్తం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు మిత్ర దేశమైన.. ముస్లిం దేశమైన ఒమన్ సుల్తాన్ మరణం పట్ల అధికారికంగా సంతాప దినం పాటించడం అనేది గమనార్హం.

ఒమన్ సుల్తాన్ మరణం పట్ల ప్రధాని మోదీ శనివారం సంతాపం ప్రకటించారు. పశ్చిమాసియాలో శాంతి కోసం ఆయన ధ్రువతారలా పని చేశారని కొనియాడారు. ‘ఖబూస్ గొప్ప దార్శనికత ఉన్న నాయకుడు, రాజనీతిజ్ఞుడు, ఒమన్‌ను ఆధునికత వైపు మళ్లించి, సంపన్న దేశంగా మార్చారు. ఈ ప్రాంత, ప్రపంచ శాంతికి ఆయన ఓ ధ్రువతార’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఒమన్ సుల్తాన్ భారత్‌కు నిజమైన స్నేహితుడన్న మోదీ.. ఆయన నాయకత్వంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో బలపడిందన్నారు.

1970లో బ్రిటన్ సహకారంతో ఒమన్ సుల్తాన్‌గా ఖబూస్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి 2020 జనవరి 10 వరకు సుల్తాన్‌గా కొనసాగారు. బిన్ విదేశాంగ విధానం ఒమన్‌ను ఆధునికత వైపు నడిపించింది. 2016 నాటి అమెరికా, ఇరాన్‌ అణు ఒప్పందంలో ఖబూస్‌ కీలక పాత్ర పోషించారు. ఇరుపక్షాలకు మధ్యవర్తిగా వ్యవహరించారు. సుల్తాన్ మృతికి ఒమన్ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. పెళ్లయిన మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకున్న ఒమన్ సుల్తాన్ మరో పెళ్లి చేసుకోకుండా.. దేశాన్ని ప్రగతి పథంలో నిలపడానికి నిరంతరం కృషి చేశారు. ముస్లిం దేశమైన ఒమన్‌లో అక్షరాస్యత 90 శాతం ఉందంటే.. ఖబూస్ పనితీరు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఒమన్ సుల్తాన్‌గా ఖబూస్ స్థానంలో సయ్యిద్ హైతమ్ బిన్ తరీఖ్ అల్ సయిద్ బాధ్యతలు చేపట్టనున్నారు. సయ్యద్ హైతమ్‌కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. ఆయన నాయకత్వంలో ఒమన్ మరింతగా పురోగతి సాధిస్తుందని.. ప్రపంచ శాంతికి తన వంతు కృషి చేస్తుందని ఆకాంక్షించారు. భారత్, ఒమన్ మధ్య ప్రాచీన కాలం నుంచి సంబంధాలు ఉన్నాయన్న మోదీ.. సయ్యద్ హైతమ్ నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని, వ్యూహాత్మక భాగస్వామం బలపడుతుందని ఆకాంక్షించారు.

Source link

0 0
Next Post

A ray of hope for rape victims

“Justice delayed, is justice denied” goes the saying. But, speedy justice is hard to come by, with trials usually taking years to reach a conclusion. The reasons include shortage of judges, judicial staff, witnesses turning hostile, and the like. Post the recent rape and murder of a woman veterinarian in […]