nizamabad deaths: కొంపముంచిన అమావాస్య.. ముగ్గురి దుర్మరణం.. నిజామాబాద్‌లో విషాదం – three killed after wall collapses in nizamabad

APNEWS CO
Read Time2 Minute, 59 Second


అమావాస్య అని ఆగడమే వారి కొంపముంచింది. రెండ్రోజులు ఆగి కొత్తింట్లోకి వెళ్దామనుకున్న కుటుంబాన్ని అకాల మృత్యువు మింగేసింది. అద్దెకి ఉంటున్న ఇంటి గోడ ముగ్గురిని బలితీసుకుంది. మరో ముగ్గురు బిడ్డలు తల్లీదండ్రిని కోల్పోయి అనాథలుగా మిగిలేలా చేసింది. ఈ అత్యంత విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

వర్ని మండలం తగిలేపల్లికి చెందని లక్ష్మి(30)కి గాంధారి మండలం చద్మల్‌కి చెందిన శ్రీనివాస్‌(34)తో పదేళ్ల కిందట వివాహమైంది. వారికి నలుగురు పిల్లలు. కొద్దికాలం అత్తింటి వద్ద కాపురం ఉన్న లక్ష్మి.. ఊళ్లో తల్లి గంగామణి ఒంటరిగా ఉంటోందని కుటుంబంతో కలసి తగిలేపల్లికి వచ్చి నివాసం ఉంటోంది. అక్కడే భార్యాభర్తలిద్దరూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

Also Read: ఇంట్లో చోరీకి వెళ్లిన దొంగ.. ఒంటరిగా యువతి.. ఏటీఎం పిన్ చెప్పలేదని..

సొంతిల్లు కావాలన్న కోరికతో పంచాయతీ వారిని సంప్రదిస్తే ఖాళీ స్థలం మంజూరు చేశారు. ఆ స్థలంలో రేకుల షెడ్డు నిర్మించుకున్న శ్రీనివాస్‌ దంపతులు కొత్తింట్లోకి వెళ్దామని అనుకున్నారు. ఈలోపు అమావాస్య రావడంతో మూడ్రోజులు ఆగి వెళ్దామని వాయిదా వేసుకున్నారు. షెడ్డు వద్ద పనులు ఉంటే చూసుకుని అద్దెకు ఉంటున్న ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నారు.

తెల్లవారుజామున లేచి గంగామణి ఇంటి పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా ఇంటి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనివాస్, లక్ష్మి దంపతులు సహా పిల్లలపై సిమెంటు పెళ్లలు పడడంతో తీవ్రగాయాలయ్యాయి. లక్ష్మి, ఏడాది బాబు సాయికుమార్ అక్కడికక్కడే చనిపోయారు. ఆసుపత్రిక తరలిస్తుండగా శ్రీనివాస్ ప్రాణాలు విడిచాడు. తీవ్రగాయాలపాలైన కూతుళ్లు సంజన(8), అశ్విని(5), వైష్ణవి(3)ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read Also: సొంత అక్కతో ఆ సంబంధం.! తమ్ముడిని చంపేసిన బావ.. ప్రకాశంలో దారుణం



Source link

0 0
Next Post

పెళ్లి కోసం.. కాబోయే అత్తారింటికి 70 కి.మీ. నడిచి వెళ్లిన యువతి!

గత ఏప్రిల్ నెలలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌కు చెందిన ఓ యువతి ప్రియుడి కోసం మచిలీపట్నం వరకు నడిచి వెళ్లి పెళ్లి చేసుకున్న ఘటన గుర్తుందా? లాక్‌డౌన్ టైంలో ఆ యువతి ఒంటరిగా 70 కి.మీ. నడిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఉత్తరప్రదేశ్‌లోనూ దాదాపు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… కాన్పూర్‌కు చెందిన గోల్డి అనే యువతికి కన్నౌజ్‌కు చెందిన వీరేంద్ర అనే యువకుడితో పెళ్లి చేయాలని […]