nellore woman rape : నెల్లూరులో ఘోరం… యువతిని రేప్ చేసి చంపేసిన కామాంధులు – 23 yr old woman rape and murdered in nellore district

admin
Read Time46Seconds


కఠిన శిక్షలు పడుతున్నా తెలుగు రాష్ట్రాల్లో కామాంధులు బుద్ధి తెచ్చుకోవడం లేదు. ‘దిశ’ హత్యాచారం కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుందని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా రోజూ ఎక్కడో చోట మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ యువతిని ఎత్తుకెళ్లిన దుండగులు అత్యాచారం చేసి ప్రాణాలు తీశారు.


Also Read:
తెలంగాణలో కీచక వార్డెన్.. విద్యార్థినులను గదిలోకి పిలిచి కోరిక తీర్చాలంటూ

నెల్లూరు జిల్లా గూడూరు మండలం చవటపాలెంకు చెందిన పర్వేన్(23) అనే యువతిపై అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయింది. సోమవారం ఆమె మృతదేహాన్ని ఇంటి సమీపంలోనే స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన పర్వేన్‌ ఇలా విగతజీవిగా కనిపించడం, ఆమెను రేప్ చేసి చంపేశారని తెలియడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read:
లగ్జరీ హోటల్‌లో వ్యభిచారం.. 10మంది టీవీ తారలు, ఐదుగురు బ్రోకర్లు అరెస్ట్

ఈ ఘటనపై సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు చవటపాలెం గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యులను విచారించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం పర్వేన్ మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువతిపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా చంపేసిన కామాంధులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read:
ప్రియుడి మోజులో భర్త గొంతు కోసేందుకు యత్నం.. చిత్తూరులో మహిళ కిరాతకం





Source link

0 0
Next Post

Regional parties detrimental to national integrity, says former TDP MP Diwakar Reddy- The New Indian Express

By Express News Service ANANTAPUR: Former MP and TDP leader JC Diwakar Reddy said that the presence of regional parties in the country would be detrimental to national integrity. JC called on BJP national secretary V Satya Murthy, who was here to attend the 38th State conference of ABVP. While […]