nellore sex racket: షార్ట్ ఫిల్మ్‌ పేరిట యువతులకు వల.. లొంగదీసుకొని వ్యభిచారంలోకి.. – nellore police busted sex racket, saves 7 girls from prostitution

admin
Read Time44Seconds


షార్ట్ ఫిల్మ్‌లలో నటించే అవకాశం ఇస్తానని.. సినిమా అవకాశాల పేరిట వల వేసి.. అమాయక యువతులను వ్యభిచార కూపంలోకి దించుతున్న కేటుగాడిని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కోవూరుకు చెందిన మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తోన్న వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. ఈ దాడుల ద్వారా ఏడుగురు అమ్మాయిలను రక్షించిన పోలీసులు.. వారిని సంరక్షణ కేంద్రానికి తరలించారు.

ఐదుగురు విటులను, 8 మంది వ్యభిచారగృహ నిర్వాహకులను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నెల్లూరు స్టార్ గన్’ పేరుతో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నానని, సినిమా అవకాశాలు ఇప్పిస్తానని జాకీర్.. అమ్మాయిలను నమ్మించి మోసం చేశాడని పోలీసులు గుర్తించారు.


అవకాశాల పేరిట యువతులను శారీరకంగా లొంగదీసుకునే వాడని.. సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్యంగా వీడియోలు తీసి.. తర్వాత వాటిని చూపెట్టి బ్లాక్ మెయిల్ చేసేవాడని చెప్పారు. పరువు పోతుందనే భయంతో యువతులు అతడు చెప్పిన మాట వినేవారన్నారు.

యువతుల బలహీనతలను ఆసరాగా చేసుకొని.. వారిని వ్యభిచార రొంపిలోకి దింపేవాడన్నారు. నెల్లూరు నగరంలోని సీఐలు, డీఎస్పీ కలసికట్టుగా చేసిన ఆపరేషన్లో ఈ వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది.





Source link

0 0
Next Post

Chandrababuకి కృతజ్ఞతాభివందనాలతో.. టీడీపీకి సాధినేని యామిని రాజీనామా

ఏపీలో నేతల వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీ, వైఎస్ఆర్సీపీల్లో చేరగా.. తాజాగా టీడీపీ నుంచి మరో వికెట్ పడింది. టీడీపీ అధికార ప్రతినిధిగా టీవీ డిబేట్లలో పాల్గొన్న టీడీపీకి గుడ్ బై చెప్పారు. చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన ఆమె.. టీడీపీ అధినేతపై ప్రశంసలు గుప్పించారు. స్వదస్తూరితో బాబుకు లేఖ రాసిన ఆమె.. చంద్రబాబు నాయకత్వంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నానన్నారు. నాయకుడికి ఉండాల్సిన ఓర్పు, చాణక్యత, […]