narabali in kurnool: కర్నూలులో నరబలి.. యువకుడిని నరికి తల, మొండెం వేరుగా! – teen murder near a temple creates narabali rumours in kurnool

admin
Read Time52Seconds


ఆలయం సమీపంలో యువకుడి హత్య. యువకుడిని నరికి చంపి తల, మొండెం వేరు చేసిన దుండగులు. గుప్త నిధుల కోసం బలి ఇచ్చి ఉంటారని స్థానికుల అనుమానం.

Samayam Telugu | Updated:

ర్నూలు జిల్లాలో ఓ యువకుడి హత్య కలకలం రేపుతోంది. సిరివెళ్ల సమీపంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కనిపించింది. యువకుడిని నరికి తల, మొండెం వేరు చేసిన స్థితిలో ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానిక నరసింహ స్వామి దేవాలయం సమీపంలో ఈ ఘటన జరగడంతో గుప్త నిధుల కోసం యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు బలిచ్చినట్లుగా ప్రజలు చర్చించుకుంటున్నారు.


స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. యువకుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గుప్త నిధుల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారా? లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Web Title teen murder near a temple creates narabali rumours in kurnool

(Telugu News from Samayam Telugu , TIL Network)





Source link

0 0
Next Post

Sridevi death: శ్రీదేవిది హత్యే.. నీటితొట్టెలో ముంచి చంపేశారు: మాజీ డీజీ - sridevi's death could be murder, kerala dgp claims quotes of dead friend

శ్రీదేవి మరణం మరోసారి చర్చనీయాంశమైంది. ఏడాది కిందట మరణించిన నటి శ్రీదేవిది హత్యేనని కేరళకు చెందిన ఓ మాజీ పోలీసు అధికారి చెప్తున్నారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. Samayam Telugu | Updated:Jul 12, 2019, 11:30PM IST అతిలోక సుందరిగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న నటి శ్రీదేవి మరణం మరోసారి చర్చనీయాంశమైంది. ఆ అలనాటి నటిది సహజ మరణం కాదని.. హత్యేనని అంటున్నారు. ఇందులో కొత్తేముంది.. […]