Nara Lokesh: చిన్న బోటు తీయలేని చేతగాని ప్రభుత్వం.. మంత్రి సాక్షిగా అమాయకుడు బలి: లోకేశ్ – old man drowns in flood at prakasam barrage, tdp general secretary nara lokesh blames ys jagan govt

admin
Read Time47Seconds


ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాదవశాత్తూ వరద నీటిలో పడిపోయిన ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. చేపల కోసం చూస్తుండగా.. కాలు జారడంతో వరద నీటిలో కొట్టుకొని పోయాడు. కాసేపు ఈత కొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ.. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సాధ్యపడలేదు. మత్స్యకారులు అతణ్ని ఒడ్డుకు చేర్చి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఆ సమయంలో మంత్రి అనిల్ కుమార్ ప్రకాశం బ్యారేజీ వద్దే ఉన్నారు.


ఈ ఘటన పట్ల టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ప్రకాశం బ్యారేజి గేటుకి అడ్డంగా ఉన్న చిన్నబోట్ తియ్యలేని చేతగాని ప్రభుత్వం, మంత్రి సాక్షిగా ఒక అమాయకుడి ప్రాణాన్ని మింగేసిందని ఆయన ఆరోపించారు. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి మరీ ఇంత చులకనేంటి? అని ఆయన ప్రశ్నించారు. గేట్లు తెరిచే ముందు కనీస హెచ్చరికలు చేయాలని తెలీదా? ఏమిటీ అహంకారం? మంత్రి సమక్షంలోనే ఇలా జరగడం దారుణం అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల రక్షణలో ప్రభుత్వం వంద శాతం విఫలమయ్యిందని లోకేశ్ విమర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.

ఏం జరిగిందంటే..?

ప్రకాశం బ్యారేజీ 68వ గేటు వద్ద చిక్కుకుపోయిన బోటును ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్న సందర్భంలో అపశృతి దొర్లింది. బోటును తీయడం చూసేందుకు బ్యారేజీ మీదకు చేరుకున్న జనాల్లో ఒక వ్యక్తి బ్యారేజీ మీద నుంచి కింద నీళ్లల్లోకి పడిపోయాడు. బ్యారేజీ రెయిలింగ్ మీద నుంచి తొంగి తొంగిచూస్తుండగా ఈ ఘటన జరిగింది. అదే సమయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా బోటు తీస్తున్న పనులను పర్యవేక్షించడానికి బ్యారేజీ మీదకు వచ్చారు.

మంత్రి బ్యారేజీ మీద ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. నీళ్లల్లో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడాలంటూ మంత్రి పోలీసులను ఆదేశించారు. అలాగే మత్స్యకారులను వెంటనే వెళ్లాలంటూ గట్టిగా అరిచారు. బ్యారేజీ మీద ఉన్న జనాలంతా చూస్తుండగానే ఆ వ్యక్తి కొట్టుకుపోతూ కనిపించారు.

అదే సమయంలో శనీశ్వరుడి దేవాలయం ఎదురుగా నదిలో చేపలు పడుతున్నమత్స్యకారులు వెంటనే అప్రమత్తమై బోటును అక్కడికి తీసుకెళ్లి వ్యక్తిని కాపాడి ఒడ్డుకు తెచ్చారు. ఒడ్డుకు చేర్చే వరకూ ప్రాణాలతో ఉన్న ఆ వ్యక్తి కొద్దిసేపటికే ప్రాణాలు వదిలాడు. అయితే ఆ వృద్ధుడు ఎవరనేది తెలియలేదు.

Source link

0 0
Next Post

Jagaddhatri: భర్త మరణాన్ని తట్టుకోలేక.. ప్రముఖ రచయిత్రి జగద్ధాత్రి బలవన్మరణం - well known writer jagaddhatri commits suicide in her house

శాఖపట్నం: ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఆమె ఇంట్లో ఉరేసుకుని మరణించినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆమె భర్త రామతీర్థ మరణించారు.రామతీర్థ కూడా రచనల ద్వారా సాహితీలోకానికి సుపరిచితులే. ఆయన చనిపోయిన తర్వాత జగద్ధాత్రి మానసికంగా వేదనకు గురయ్యారు. ఒంటరితనం వేధించడంతోపాటు భర్తకు సంబంధించిన ఆలోచనల నుంచి బయటకు రాలేకపోవడంతో డ్రిపెషన్‌కు లోనైన ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఒంటరితనం నుంచి బయటకు రావడానికి ఆమె వెంకోజీపాలెం […]