nalgonda daughter murder : కూతురికి పెళ్లి చేయడం ఇష్టం లేక బండరాయితో కొట్టి.. నల్గొండ జిల్లాలో దారుణం – parents try to kill own daughter in telangana nalgonda district

admin
Read Time3 Minute, 21 Second


కనీ పెంచిన కూతురినే ఆ తల్లిదండ్రులు భారంగా భావించారు. పెళ్లి చేసి ఓ వ్యక్తి చేతిలో పెట్టాలంటే డబ్బు ఖర్చు అవుతుందన్న భావతో కుమార్తెను చంపేందుకు యత్నించారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో కలకలం రేపింది. మునుగోడు నియోజకవర్గం వెలగలగూడెం గ్రామానికి చెందిన కవిత(32) పీజీ వరకు చదువుకుంది. వయసు పెరుగుతున్నా తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు.


Also Read:
చీర కోసం అలిగి వరుడు.. పెళ్లిరోజు అందరికీ షాక్

తనతో పాటు పెరుగుతూ చదువుకున్న అమ్మాయిలు పెళ్లి చేసుకుని భర్త, బిడ్డలతో హాయిగా కాపురం చేసుకుంటుంటే తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయకుండా జీవితాన్ని నాశనం చేస్తున్నారని కవిత బాధపడేది. ఈ క్రమంలోనే తరుచూ కుటుంబసభ్యులతో గొడవ పెట్టుకునేది. కుటుంబ ఆస్తిగా ఉన్న ఏడెకరాల్లో రెండు ఎకరాలను తనకు కట్నంగా ఇచ్చి పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తుండేది. పెళ్లికి కట్నం ఇస్తాం గానీ పొలం ఇచ్చే ప్రస్తకే లేదని తల్లిదండ్రులు ఆమెకు తెగేసి చెప్పారు.

Also Read:
మహిళను కాపాడిన ‘కరోనా’… వైరస్ సోకిందని తెలిసి పరుగు తీసిన కామాంధుడు

ఈ క్రమంలోనే కవితకు పెళ్లి చేస్తే డబ్బుతో పాటు ఆస్తి పోతుందని ఆలోచించిన తల్లిదండ్రులు ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి నిద్రపోతున్న కవిత తలపై బండరాయితో బలంగా కొట్టారు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు వచ్చేసరికే నిందితులు పరారయ్యారు. దీంతో స్థానికులు కవితను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:
కూలిపని కోసం తీసుకెళ్లి వివాహితపై రేప్.. కోరిక తీర్చాలంటూ మళ్లీ వేధింపులు





Source link

0 0
Next Post

hyderabad cheater arrest : మధ్య తరగతి జనంపై మాయ వల.. హైదరాబాద్‌ కేటుగాడి ఘరానా మోసం - cheater arrested by hyderabad police, who collects money as union minister kishan reddy pa

అమాయకులైన పేదలు.. మధ్యతరగతి ప్రజలే టార్గెట్‌గా వలేశాడో కేటుగాడు. ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూమ్‌ ఇళ్లు కేటాయిస్తామని చెప్పి అందినకాడికి దోచుకున్నాడు. కేంద్ర మంత్రి పీఏనని చెబుతూ నయా దందాకు తెరతీశాడు. అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసిన ఆ కేటుగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి అతని ఆట కట్టించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఇప్పిస్తామంటూ నగదు వసూలు చేసిన నయా మోసం నగరంలో వెలుగులోకి వచ్చింది. […]