Nagpur girl rape : నోట్లో గుడ్డలు కుక్కి యువతిపై రేప్.. ప్రైవేట్ పార్ట్స్‌లో ఐరన్ రాడ్‌తో వికృత చేష్టలు – nagpur: ‘he raped me, inserted rod in my private parts’ spinning mill worker accused supervisor

admin
Read Time3 Minute, 12 Second


నిర్భయ ఘటన తరహాలో మరో దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. యువతి నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా అత్యాచారం చేసి.. ఐరన్ రాడ్‌తో హింసించిన అత్యంత క్రూరమైన ఘటన జరిగింది. ఓ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న యువతి(19)పై కన్నేసిన సూపర్ వైజర్ అదను చూసి ఆమెను రేప్ చేశాడు. అత్యంత దారుణంగా మర్మాంగంలో ఇనుప రాడ్డు పెట్టి వికృత చేష్టలకు పాల్పడ్డాడని బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read:

అన్నం, నీళ్లు లేకుండా అదే పని.. యువతికి నరకం చూపిన రాక్షసుడు..

నాగ్‌పూర్‌లోని ఓ స్పిన్నింగ్ మిల్లులో యువతి పని చేస్తోంది. మరో మహిళ సహా సోదరుడితో కలిసి ఓ అద్దె ఇంట్లో నివాసముంటోంది. అదే మిల్లులో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న యోగిలాల్(52) ఆమెపై కన్నేశాడు. యువతి సోదరుడు సహా మరో మహిళ ఊరికి వెళ్లడంతో ఆమె ఒంటరిగా ఇంట్లో ఉంది. ఇదే అదనుగా భావించి సూపర్‌వైజర్ యోగిలాల్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నోట్లోగుడ్డలు కుక్కి అత్యంత పాశవికంగా పశువాంఛ తీర్చుకున్నాడు.

Read Also:
కుక్కని నిమిరిన మహిళ.. నాకు కూడా అంటూ ప్యాంట్ జిప్ తీసేసి.. పార్క్‌లో యువకుడి అరాచకం

అంతటితో ఆగని కామాంధుడు ఆమె మర్మాంగాల్లో ఐరన్ రాడ్డు జొప్పింది వికృతానందం పొందాడు. ఈ మేరకు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఓ వైపు నిర్భయ ఘటనలో నిందితులకు ఉరి ఖరారైనప్పటికీ.. కామాంధుల్లో మాత్రం భయం కలగడం లేదు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.





Source link

0 0
Next Post

Nashik bus accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి - maharashtra road accident: 20 killed as bus rams into well in nashik

మహారాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న బస్సు, ఆటోను ఢీకొట్టి బావిలోకి దూసుకెళ్లింది. నాసిక్ జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనలో 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 18 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. టైరు పేలిపోవడంతో బస్సు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టి దూసుకుపోయింది. అదే వేగంతో వెళ్లి బావిలో పడడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం. Also Read: నోట్లో గుడ్డలు కుక్కి యువతిపై రేప్.. ప్రైవేట్ […]