mp balli durga prasad : YSRCP ఎంపీ టంగ్ స్లిప్.. షాకైన అధికార పార్టీ నేతలు – ysrcp mp balli durga prasad slips tongue

admin
Read Time44Seconds


తిరుపతి: వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ టంగ్ స్లిప్ అయ్యారు. క్రస్ట్ గేట్లు తెరిస్తే వైఎస్సార్సీపీలో ఎవరూ మిగలరంటూ ఆయన తడబడ్డారు. ఎంపీ వ్యాఖ్యలతో ఆయన పక్కన ఉన్న అధికార పార్టీ నేతలు, అనుచరులు అవాక్కయ్యారు. వైఎస్సార్సీపీ కాదంటూ చెప్పడంతో.. ఆయన తన తప్పిదాన్ని సరి చేసుకున్నారు. వైఎస్సార్సీపీ గేట్లు ఎత్తితో టీడీపీలో ఎవరూ మిగలరన్న ఆయన.. కేవలం చంద్రబాబు ఆయన తనయుడు మాత్రమే ఉంటారని పరోక్షంగా వ్యాఖ్యానించారు.


జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పైనా వైఎస్సార్సీపీ ఎంపీ సెటైర్లు వేశారు. ఆ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి మద్దతు పలుకుతున్నారన్నారు. పవన్ దేశం గురించి మాట్లాడతారు.. కానీ ఆయన పార్టీ ఎమ్మెల్యే ఆయన మాట వినరంటూ ఎంపీ విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రజారంజకంగా ఉందన్నారు.

ఏపీకి మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ర్యాలీలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అన్నట్టు బల్లి దుర్గాప్రసాద్ కూడా ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరి తిరుపతి ఎంపీగా గెలుపొందారు.





Source link

0 0
Next Post

british model madalyn davis dead : సెల్ఫీ పిచ్చి.. ప్రముఖ మోడల్ దుర్మరణం - british model madalyn davis dead due to tried to selfie on the edge of cliff

సెల్ఫీ పిచ్చికి మరో ప్రాణం పోయింది. బ్రిటన్‌లోని లింకన్‌షైర్‌కు చెందిన ప్రముఖ వర్ధమాన మోడల్ మోడలిన్‌ డేవిస్‌ (21) 100 అడుగుల ఎత్తు నుంచి సముద్రంలో పడి మరణించింది. డేవిస్ తన మిత్రులతో కలిసి సెల్ఫీలకు ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియాలోని ‘డైమండ్‌ బే రిజర్వ్‌’ పర్వతాలపైకి వెళ్లారు. సూర్యోదయ సమయంలో ఆ పర్వత ప్రాంతం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. దీంతో 100 అడుగుల ఎత్తున్న పర్వత శిఖరం ఎక్కి ఆమె […]