motor vehicle act 2019: తాగి బండి నడిపితే రూ.10 వేలు, లైసెన్స్ లేకపోతే రూ.5 వేలు ఫైన్.. సెప్టెంబరు 1 నుంచి అమలు! – president approves motor vehicle amendment act 2019, centre to be implemented from sept 1

admin
Read Time5 Minute, 28 Second


రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కేంద్రం కొరడా ఝళిపించింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రస్తుతం వసూలుచేస్తున్న జరిమానాను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు సెప్టెంబరు 1 నుంచి అమలులోకి రానున్న మోటారు వాహన నిబంధనల సవరణ చట్టానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇప్పటికే ఆమోదం తెలిపారు. దీంతో రవాణా నిబంధనలు మరింత కఠినతరమయ్యాయి. వీటిని దశలవారీగా అమలు చేయాలని కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ నిర్ణయించింది. డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్‌, ఆన్‌లైన్‌ ద్వారా డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ, రహదారి భద్రతా నిధి, ప్రైవేటు క్యాబ్‌ వ్యవస్థల స్థిరీకరణ, రవాణా వ్యవస్థలో సంస్కరణలు తదితర అంశాలను దశలవారీగా అమలులోకి తీసుకురానున్నారు.


Read Also: ‘జగన్ సర్కార్ వెనకడుగు?.. మోదీ, షా చెప్పాకే నిర్ణయం’

ఓవర్‌ లోడ్‌‌తో నడిచే సరకు రవాణా వాహనాలు, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వాహనాలకు భారీగా ఫైన్ పడనుంది. సరకు రవాణా వాహనాలు అధిక బరువుతో పట్టుపడితే ప్రస్తుతం రూ.2 వేలు ఫైన్ విధిస్తుండగా, అదనపు బరువు కింద టన్నుకు రూ.1,000 అదనంగా వసూలు చేసేవారు. తాజాగా ఆ మొత్తాన్ని రూ.20,000 పెంచారు. అలాగే అదనపు బరువు కింద ప్రతి టన్నుకు రూ.2,000 నిర్ణయించారు. అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకుంటే ఫైన్ కింద ఒక్కొక్కరికి రూ.1,000 వసూలు చేయనున్నారు. బైక్‌పై అధిక బరువును వినియోగిస్తే రూ.2 వేలు ఫైన్‌తోపాటు 3 నెలలపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తారు. గతంలో రూ.100 జరిమానా విధించేవారు.

Read Also: గోదావరి జలాల మళ్లింపు: ఏపీ, తెలంగాణ అధికారుల భేటీ మళ్లీ వాయిదా.. కారణం ఇదేనా?

అలాగే హెల్మెట్ ధరించకపోతే ప్రస్తుతం రూ.100 జరిమానా విధిస్తుండగా, దీనిని రూ.1,000 పెంచడంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలలు రద్దువుతుంది. మద్యం సేవించి వాహనాలు నడిపితే రూ.2,000 నుంచి రూ.10,000కు, సీటుబెల్టు పెట్టుకోకపోతే రూ.1,000, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5,000, లైసెన్స్ రద్దుచేసినా వాహనం నడిపి పట్టుబడితే రూ.10,000, వేగంగా నడిపితే రూ.1,000 నుంచి రూ.2,000, ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10,000 ఫైన్ పడనుంది.

Read Also: ఆంధ్రా రాజధాని.. తెర మీదకు మళ్లీ శ్రీబాగ్ ఒడంబడిక?

కేంద్ర న్యాయ శాఖ నుంచి అమోదం లభించిన అంశాలపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. కొత్త నిబంధనలను సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మొత్తం 63 విభాగాలకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపిందని అన్నారు. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే సిద్ధం చేశామని అన్నారు. మోటార్ వాహనాల సవరణ చట్టం 2019 వల్ల దేశంలో భద్రత, అవినీతిరహిత రోడ్డు రవాణ వ్యవస్థకు వీలు కలుగుతుందని గడ్కరీ పేర్కొన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు నివారణతోపాటు బాధితుల సంఖ్య కూడా తగ్గుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు, సమర్థవంతమైన బహుళ రవాణా వ్యవస్థకు సహకరిస్తుందని గడ్కరీ వెల్లడించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తించిన 786 ప్రమాద ప్రాంతాల్లో రూ.12,000 కోట్లతో నివారణ చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

Source link

0 0
Next Post

Denied Road To Cremation Ground, Dalits Lower Body Off Tamil Nadu Bridge

The Dalit community said they were denied access to a cremation site by the upper caste Vellore, Tamil Nadu:  A video that shows a funeral procession lowering the dead body of a Dalit off a bridge in Vellore district of Tamil Nadu has been widely shared online, amid reports they were […]