migrant workers at delhi bus station : జనసంద్రమైన ఢిల్లీ బస్ టెర్మినల్.. జాడలేని సోషల్ డిస్టెన్సింగ్ – watch: thousands of migrant workers crowd anand vihar bus terminal amid lockdown

admin
Read Time4 Minute, 15 Second


కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం లాక్‌డౌన్ విధించడంతో దేశంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. రైళ్లు, బస్సులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కానీ వలస కార్మికులు మాత్రం భారీగా నగరాల నుంచి సొంతూళ్లకు పయనం అవుతున్నారు. లారీలు, ట్రక్కులు ఎక్కి ఊళ్లకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కూడా అందుబాటులో లేకపోతే.. నడుచుకుంటూ వెళ్తున్నారు. సొంతూళ్లకు వెళ్లడం కోసం యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు వేలాది సంఖ్యలో పిల్లాపాపలతో కలిసి ఢిల్లీలోని ఆనంద్ విహార్ బస్ షెల్టర్‌కు చేరుకున్నారు.


సొంతూళ్లకు వెళ్లాలనే ఆశతో బస్సులు ఎక్కడం కోసం వీరు 3 కి.మీ. మేర క్యూ లైన్లో నిలబడ్డారు. లాక్‌డౌన్ కారణంగా చేసేందుకు పని లేకపోవడంతో చేతిలో డబ్బుల్లేకుండా పోయాయని.. దీంతో అద్దెలు కట్టలేక.. నిత్యావసరాలు కోనుగోలు చేయలేకపోతున్నామని.. అందుకే తాము సొంతూరుకు వెళ్తున్నామని బదౌనీ జిల్లా బదౌన్ గ్రామానికి చెందిన ఓ యువకుడు తెలిపాడు.

నోయిడా, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిలిచిపోయిన తమ వాళ్లను సొంతూళ్లకు తీసుకెళ్లడం కోసం 1000 బస్సులను పంపుతున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. డీటీసీ కూడా 200 బస్సులను ఏర్పాటు చేసింది. అందుకే ఈ స్థాయిలో జనం ఆనంద్ విహార్ బస్ టెర్మినల్‌కు చేరుకున్నారు. వీరిలో చాలా మంది ముఖాలకు మాస్కులు, కర్చీఫ్‌‌లు కట్టుకున్నారు. కానీ వాటి వల్ల ఎంత మేరకు కరోనా నుంచి కాపాడుకోగలరనే అనుమానాలను చాలా మంది వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ వేళ.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నప్పటికీ.. ఈ బస్ టెర్మినల్ దగ్గర మాత్రం జనం ఒకరినొకరు తోసుకునేంతలా ఉండటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదేం లాక్‌డౌన్.. వేరే వాళ్లకు అనుమతి లేదు గానీ.. ఇంత మంది వలస కార్మికులు ప్రయాణించడానికి అనుమతి ఎలా ఇచ్చారు? ‘ఢిల్లీలోని వలస కార్మికులను తీసుకెళ్లడానికి యూపీకి బస్సులను నడపితే.. తెలంగాణ ప్రభుత్వం కూడా బిహార్, యూపీ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో చిక్కుకొని.. వెనక్కి రావాలని అనుకుంటున్న వలసదారుల్ని బస్సుల ద్వారా వెనక్కి తీసుకొచ్చేందుకు సాయం చేయాలి’ అని ఎంఐఎం నేత అసుదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు.

Source link

0 0
Next Post

coronavirus cases in america : అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా.. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, 2 వేలకు చేరువలో మరణాలు, కారణాలివే.. - coronavirus cases in us crosses 1,15,000; death toll rises 1929, here is some reasons

కరోనా కరాళనృత్యానికి అగ్రరాజ్యం అమెరికా కూడా విలవిలలాడుతోంది. ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఆ దేశంలోనే నమోదయ్యాయి. ఇప్పటికే ఆ దేశంలో పాజిటివ్ కేసులు లక్ష దాటాయి. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న న్యూ యార్క్, న్యూ జెర్సీ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకి రావాలంటేనే వణుకుతున్నారు. కరోనా కారణంగా అమెరికాలో ఇప్పటివరకు 1929 మరణాలు చోటు […]