mahbubnagar serial killer : పాలమూరు సీరియల్ కిల్లర్‌: కల్లు కాంపౌండ్‌లో కడియాలతో కనిపిస్తే ఖతమే..! – mahbubnagar serial killer srinu and his wife arrested: revealed interesting facts

admin
Read Time3 Minute, 30 Second


మహమూబ్‌నగర్ సీరియల్ కిల్లర్ ఎరుకలి శ్రీను (42) మృత్యు వేటలో మరొక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఎరుకలి శ్రీను కల్లు కాంపౌండ్‌కు కాళ్లకు కడియాలు, మెట్టెలతో వచ్చే మహిళలపై కన్నేస్తాడు. ఏమీ తెలియని అమాయకుడిలా వారిని మాటల్లో దించుతాడు. తాను కల్లు తాగుతూ వారిని కూడా తాగాలని ఆఫర్‌ చేస్తాడు. చివరకు మాయమాటలతో వారిని బుట్టలో వేసుకుని తన బైక్‌పై ఎక్కించుకుని పట్టణ శివారుకు తీసుకెళ్తాడు. అక్కడ మహిళలను పీకలదాకా తాగించి ఆ మత్తులోనే వారిపై అత్యాచారం చేసి, దారుణంగా హతమార్చి ఒంటిపై ఉన్న నగలన్నీ దోచుకుంటాడు.


Also Read: మహబూబ్‌నగర్: మద్యం తాగే మహిళలే టార్గెట్.. 16 మందిని హత్యచేసిన సీరియల్ కిల్లర్

ఇలా ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా నలుగురు మహిళలను దారుణంగా చంపేశాడు. దేవరకద్ర మండలం నవాబుపేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అలివేలమ్మ (53) అనే మహిళ హత్య కేసులో శ్రీను పాత్రను నిర్ధారించేందుకు నిందితుడిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. వరుస హత్యల వ్యవహారం బయటపడింది.

మహబూబ్‌నగర్‌ శివశక్తినగర్‌లో ఉండే ఎరుకలి శ్రీను కూలి పనిచేస్తుంటాడు. కల్లు కాంపౌండ్‌ల వద్ద కాళ్లకు కడియాలు, నగలతో కనిపించే మహిళలను ఎంచుకుంటాడు. వారిని మాయమాటలతో మభ్యపెట్టి, కల్లు తాగించి.. రేప్ చేసి హత్య చేస్తాడు. తర్వాత నగలు తీసుకుని పరారవుతాడు. భూత్పూర్‌ పరిధిలో ఆగస్టులో అంకె బాలమ్మ అనే మహిళను కూడా శ్రీను ఇదే తరహాలో హత్య చేశాడు. వీటితో పాటు కొత్తకోట, మిడ్జిల్‌ మండల శివారుల్లో ఇద్దరు మహిళలను తీసుకెళ్లి హత్య చేసినట్లు తేలింది. దోచిన నగలను శ్రీను తన భార్య సాలమ్మకు ఇస్తే.. ఆమె వాటిని అమ్మి సొమ్ముచేసుకునేది. ఈ వ్యవహారంలో సాలమ్మను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Also Read: హత్యాచారం కేసులో నిందితుడికి ఉరి!





Source link

0 0
Next Post

ISIS terrorists : క్రిస్మస్ పర్వదినాన క్రైస్తవుల ఊచకోత.. ఐసిస్ మరో రాక్షసకాండ! - isis terrorists behead 10 christians on eve of christmas in northeast nigeria

క్రిస్మస్ పర్వదినాన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. ఐఎస్ చీఫ్ అబూబకర్‌ అల్‌ బాగ్దాదీ హత్యకు ప్రతీకారంగా మారణకాండకు పాల్పడ్డారు. ఐఎస్ఐఎస్‌ను ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవనంట్‌ (ఐఎస్ఐఎల్)గా మార్చుకున్నా తమ రాక్షసబుద్ధిని మాత్రం పోగొట్టుకోలేదు. క్రిస్మస్ ముగిసిన మరుసటి రోజున ఈశాన్య నైజీరియాలో తమ చెరలో బందీలుగా ఉన్న 11 మంది క్రైస్తవులను చంపేసినట్లు ఐఎస్ఐఎల్‌తో […]