lingameni guest house: సీఆర్డీఏ నోటీసులకు లింగమనేని రిప్లయ్.. జగన్ జోరుకు బ్రేకులా? సెల్ఫ్ గోలా? – lingamaneni ramesh replies to crda demolition notices

admin
Read Time51Seconds


సీఆర్డీఏ నోటీసులకు లింగమనేని రమేశ్ సమాధానం ఇచ్చారు. తన నివాసానికి పంచాయతీ పర్మిషన్ ఉందని తెలిపారు. కానీ గతంలో ఈ ఇంటిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేసినట్టు ఆయన చెప్పడం గమనార్హం.

Samayam Telugu | Updated:

కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అవి అక్రమ కట్టడాలంటూ వాటి యజమానులకు నోటీసులు జారీచేసిన సీఆర్డీఏ వారం రోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ గడువు శనివారంతో ముగుస్తున్న వేళ.. మాజీ సీఎం చంద్రబాబు నివాసముంటున్న గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్ సీఆర్డీఏకు సమాధానం పంపారు. భవనానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన సీఆర్డీఏకు సమర్పించారు. ఆ భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయని ఆయన సీఆర్డీఏకు తెలిపారు. గతంలో రైతుల నుంచి భూమిని కొనుగోలు చేసి తర్వాత అది వ్యవసాయ భూమి నుంచి కమర్షియల్ భూమిగా ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయించానన్నారు. ఇందుకు ఇరిగేష్ శాఖ అనుమతి ఇచ్చిందంటూ డాక్యుమెంట్లు చూపించారు.


తన భవనానికి ఉండవల్లి పంచాయతీ నుంచి అనుమతి ఉందని లింగమనేని పేర్కొన్నారు. కానీ ఉండవల్లి పంచాయతీ నుంచి అనుమతులకు సంబంధించిన పత్రాలను మాత్రం ఆయన బహిర్గతం చేయలేదు. అలాగే భవనం ముందున్న స్విమ్మింగ్ పూల్‌కి ఇరిగేష్ అధికారులు అనుమతి ఇచ్చిన పత్రాలు బయటపెట్టారు. గతేడాది ఆ భవనానికి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ అంటే బీపీఎస్ కింద రెగ్యులరైజ్ చేసేందుకు దరఖాస్తు చేశానన్నారు.

గతంలో అంటే చంద్రబాబు ఆ ఇంట్లోకి మకాం మార్చిన కొత్తలో అక్రమ కట్టడాల వ్యవహారం తెరమీదికి వచ్చినపుడు ఇదే లింగమనేని రమేష్ మీడియా ముందు మాట్లాడారు. ఆ భవనం తనది కాదని… ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి ఇచ్చేశానని మీడియా ముందు ఆయన ప్రకటించారు. ప్రభుత్వానికి ఇచ్చేసినట్టుగా సంబంధిత ఫారాలు కూడా నింపి సీఆర్డీఏకు ఇచ్చేశానన్నారు. ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి ఇచ్చేశాను కాబట్టి దాన్ని ఏ విధంగా వాడుకుంటారో తనకు అనవసరమన్నారు. ఇక్కడ భూమిని ఇచ్చేశాను కాబట్టి ప్రభుత్వం రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇస్తే తీసుకుంటానని కూడా చెప్పారు.

లింగమనేని తాజాగా ఆ భవనం తనదేనని చెప్పడంతో… గతంలో చెప్పిందంతా అబద్ధమేనని భావిస్తున్నారు. ఆ ఇల్లు, భూమి ఇప్పటికీ లింగమనేని రమేష్ పేరు మీదే ఉంది. అందుకే ఏటా ఆయన పేరిటే పంచాయతీ పన్ను చెల్లిస్తున్నారు. మరోవైపు బీపీఎస్ కోసం కూడా ఆయన పేరిటే దరఖాస్తు చేశారు. అందుకే సీఆర్డీఏ అధికారులు ఆయనకు నోటీసులు పంపారని తెలుస్తోంది.

భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయంటూ లింగమనేని సమాధానం ఇవ్వడం సీఆర్డీఏ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. భవనం తనది కాదని గతంలో ప్రకటించిన ఆయన.. ఇప్పుడు మళ్లీ నాదేనని ఎలా అంటున్నారని లింగమనేని ప్రతినిధులను సీఆర్డీఏ అధికారులు ప్రశ్నించగా, అటు నుంచి సమాధానం రాలేదు.

లింగమనేని బదులివ్వడంతో.. తదుపరి ఏం చేయాలనే దానిపై సీఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కూల్చివేతకు వెళ్లేముందు న్యాయ సలహా తీసుకుంటున్నారు. పంచాయతీ పర్మిషన్ ఉందని లింగమనేని చెబుతున్నప్పటికీ, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించలేదు. కాబట్టి అదంతా అబద్దమేనని నిర్ధారించకున్నారు. సంబంధిత డాక్యుమెంట్ల కోసం రెండు రోజులు వేచి చూసి.. ఇంటిని ఖాళీ చేయాలని చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అవకాశముంది. ఆయన ఖాళీ చేయగానే లింగమనేని గెస్ట్ హౌస్ మరో ప్రజావేదిక కానుంది.

 

Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Web Title lingamaneni ramesh replies to crda demolition notices

(Telugu News from Samayam Telugu , TIL Network)

Source link

0 0
Next Post

MDMK Chief V Gopalaswamy, Vaiko Files Nomination For Rajya Sabha Polls, Day After Conviction

Vaiko was convicted for sedition over a controversial speech he made in 2009 at the launch of his book. Chennai:  Tamil politician V Gopalaswamy or Vaiko today filed his nomination for Rajya Sabha polls, a day after the MDMK chief was sentenced to a year in jail for sedition by […]