kurnool road accident : కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆస్పత్రిలో ఆర్తనాదాలు – kurnool lorry drunk and drive: one dead, 8 injured

admin
Read Time3 Minute, 39 Second


నూతన సంవత్సరం వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. చిత్తూరు రోడ్డు ప్రమాదం కళ్ల ముందు మెదులుతుండగానే కర్నూలులో సైతం ఘోర విపత్తు చోటుచేసుకుంది. కర్నూలు నగరంలోని కృష్ణానగర్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. స్థానిక ఐటీసీ కంపెనీ కూడలి వద్ద మద్యం సేవించిన లారీ డ్రైవర్ వేగంగా వచ్చి కారును ఢీకొట్టాడు. తర్వాత ఆటోను, రెండు బైక్‌లను ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే ఒకరు దుర్మరణం చెందగా, కనీసం 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. దీంతో క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగం గంభీరంగా మారిపోయింది. బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రికి చేరుకుంటున్నారు.


ప్రమాదం జరిగిన తీరు చాలా భయానకంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఈ ప్రదేశంలో ప్రమాదాలు నిత్య కృత్యంగా మారాయి. ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ కట్టాలని ఎప్పటి నుంచో ప్రజలు డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. అలాగే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహణ కూడా ఇక్కడ దారుణంగా ఉన్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఈ రోడ్డు నిర్వహణ అత్యంత నాసిరకంగా ఉందని, రోడ్లన్నీ గుంతలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే సిగ్నల్స్ కూడా సరిగా లేవన్నారు.

Also Read: ‘చిత్తూరు’లో ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురి మృతి, పదుల్లో క్షతగాత్రులు

కాగా, కొన్ని గంటల క్రితమే చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం కంపల్లెలో సిద్ధేశ్వరస్వామి కొండ వద్ద ట్రాక్టర్ బోల్తాపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందగా.. 10 మందికి పైగా గాయపడ్డారు. జిల్లాలోని మెదలపల్లి, బొడ్డుపల్లి గ్రామాలకు చెందిన ‘ఓం శక్తి’ మాల వేసుకున్న భక్తులు నూతన సంవత్సరం సందర్భంగా సిద్ధేశ్వరస్వామి వారిని దర్శించుకుని వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Source link

0 0
Next Post

vizianagaram students gang war : విజయనగరంలో ‘బ్లేడ్ బాబ్జీలు’.. అమ్మాయి కోసం పరస్పర దాడులు - vizianagaram students blade attack on another gang, dispute over girl

ఓ అమ్మాయి విషయమై మొదలైన గొడవ బ్లేడులతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. దాడుల్లో నలుగురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని లఖనాపురం గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఈ విషయం తెలుసుకొన్న పార్వతీపురం సీఐ దాశరథి, ఎస్‌ఐ వై.సింహచలంతో పాటు సిబ్బంది లఖనాపురం, పెదబుడ్డిడిలో ఈ సంఘటనపై దర్యాప్తు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడికి […]