Kulbhushan verdict: ICJ: 15 దేశాల జడ్జిల సపోర్ట్ భారత్‌కే, ఏకాకిగా మిగిలిన పాక్.. మిత్రుడికి హ్యాండిచ్చిన చైనా – kulbhushan jadhav verdict: only pakistan votes against india at icj

admin
Read Time44Seconds


కుల్‌భూషణ్ జాదవ్ కేసులో పాకిస్థాన్‌పై భారత్ పైచేయి సాధించింది. జాదవ్ ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ భారత్‌కు అనుకూలంగా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఐసీజేలోని 16 దేశాలకు చెందిన న్యాయమూర్తుల్లో 15 మంది జడ్జిలు భారత్‌ వాదనను సమర్థించగా.. పాకిస్థాన్ ఏకాకిగా మారిపోయింది. ఈ కేసులో అమెరికా, చైనాలు పాకిస్థాన్‌కు మద్దతునిచ్చే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. కానీ అమెరికాతోపాటు అనూహ్యంగా పాక్ మిత్రదేశమైన చైనా కూడా భారత్‌ వాదనతో ఏకీభవించింది.


ఈ కేసులో భారత్‌కు వ్యతిరేకంగా వాదిస్తోన్న పాకిస్థాన్‌కు చెందిన అడ్‌హక్ జడ్జి తస్సాదుఖ్ హుస్సేన్ జిలానీ మాత్రమే తమ దేశానికి మద్దతుగా నిలిచారు.

ఇస్లాం దేశాలు కూడా భారత్‌ వాదనకే మద్దతు తెలపడం విశేషం. ఈ కేసులో వాదనలను బలంగా వినిపించడంతోపాటు అంతర్జాతీయంగా దౌత్యపరంగా భారత్ ఎంత కృషి చేసిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. సోమాలియా, చైనా, స్లోవేకియా, ఫ్రాన్స్, మొరాకో, బ్రెజిల్, అమెరికా, ఇటలీ, ఉగాండా, జమైకా, ఆస్ట్రేలియా, రష్యా, లెబనాన్, జపాన్, బెల్జియం దేశాల న్యాయమూర్తులు భారత్‌ వాదనతో ఏకీభవించారు.

వియన్నా ఒప్పందం ప్రకారం భారత దౌత్య అధికారులు వెంటనే జాదవ్‌ను కలిసేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించిన ఐసీజే… జాదవ్ హక్కులను పాకిస్థాన్ కాలరాసిందని మండిపడింది. అతడి తరఫున వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలని ఆదేశించింది.





Source link

0 0
Next Post

Ahead Of Trust Vote, Karnataka Rebel Lawmaker Ramalinga Reddy Says Will Withdraw Resignation

Ramalinga Reddy is among the 18 legislators who quit the Karnataka coalition government. Bengaluru:  With hours to go for the trust vote in the Karnataka assembly, rebel Congress legislator Ramalinga Reddy on Wednesday evening said he will withdraw his resignation and vote in favour of the Congress-Janata Dal Secular coalition […]