Kerala Floods: వరద ముంపులో కేరళ, మహారాష్ట్ర.. రూ.10కోట్ల సాయం ప్రకటించిన షిర్టీ ట్రస్టు – floods update: 1.6 lakh displaced, 46 killed in kerala, 761 villages affected in maharastra

admin
Read Time53Seconds


కేరళ, మహారాష్ట్రను వరద కష్టాలు వీడటం లేదు. వందలాది గ్రామాలు నీట మునగడంతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద బాధితులను రెస్క్యూ టీమ్స్ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Samayam Telugu | Updated:

రెండు వారాల క్రితం వరకు వర్షాలు లేక దేవుళ్లకు మొక్కిన ప్రజలే నేడు కాస్త విరామం ఇవ్వు వరుణదేవా.. అంటూ చేతులు జోడించి ప్రార్థనలు చేసిన కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు.. నేడు కాస్త విరామం తీసుకో వరుణ దేవా అని వేడుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో వరుణుడు చేస్తున్న విధ్వంసం మామూలుగా లేదు మరి. కుండపోత వర్గాలకు దక్షిణాదిలో కేరళ, కర్ణాటక రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వరద బీభత్సానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

దేశవ్యాప్తంగా వరదల కారణంగా చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఇప్పటివరకు సుమారు 114 మంది మృతిచెందారు. వరద నీటిలో మరికొంత మంది గల్లంతయ్యారు. చాలాచోట్ల కొండ చరియలు విరిగిపడటంతో శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వరద ముంపులో చిక్కుకున్న ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ సహా పలు సహాయ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

కేరళలోనే ఇప్పటివరకు సుమారు లక్షన్నర మందిని వరద సహాయ కేంద్రాలకు తరలించారు. కోచి విమానాశ్రయంలో శనివారం అర్ధరాత్రి నుంచి విమాన సర్వీసులు నిలిపివేశారు. వరద తగ్గుముఖం పడితే ఆదివారం మధ్యాహ్నం తర్వాత రాకపోకలు పునరుద్ధరించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. కేరళలోని అన్ని జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుని నిండుకుండలా మారాయి. ఇప్పటికే 8జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రంలో వరద మృతుల సంఖ్య 46 దాటింది.

మహారాష్ట్రలోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటివరకు 4లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితుల సహాయార్ధం షిర్టీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు రూ.10కోట్లు ప్రకటించింది. మరోవైపు వరద సహాయచర్యలపై అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.

 

Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Web Title floods update 1 6 lakh displaced 46 killed in kerala 761 villages affected in maharastra

(Telugu News from Samayam Telugu , TIL Network)

Source link

0 0
Next Post

Two killed in Srikakulam pharma unit blast- The New Indian Express

By Express News Service VIJAYAWADA: A blast in the boiler unit of a private pharma company in Pydibhimavaram of Srikakulam district in Andhra Pradesh killed two workers and left two others severely injured. The deceased have been identified as Rahul (shift in charge) and Raja Rao- the boiler operator of Aurobindo […]