Karnataka woman: వికారాబాద్ ఫారెస్ట్‌లో సగం కాలిన మృతదేహం.. మిస్టరీ వీడిందిలా – karnataka young woman died after abortion failure, dead body found in vikarabad

admin
Read Time46Seconds


వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న యువకుడు ఆమెకు అబార్షన్ చేయించేందుకు చేసిన ప్రయత్నం విఫలమై ఆమెకు ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమెను సమీప అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి నిప్పంటించి ఏమీ తెలియనట్లు నటించాడు. పోలీసుల రంగ ప్రవేశంలో అతడు చేసిన ఘోరం వెలుగులోకి వచ్చింది.

Also Read:
వైజాగ్ ఆర్మీ జవాన్‌ది హత్యే.. ప్రియుడితో కలిసి చంపేసిన భార్య

కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఇస్తేరాణి శిభ(22) అనే యువతి డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఈ క్రమంలోనే ఓ యువకుడితో ప్రేమలో పడి హద్దులు దాటింది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం బయటపడితే తనకు చిక్కులు తప్పవని భావించిన ప్రియుడు ఆమెకు అబార్షన్ చేయించాలనుకున్నాడు. అయితే శిభకు ఆరో నెల రావడంతో అబార్షన్ చేయిస్తే ప్రమాదమని డాక్టర్లు చెప్పినా వినకుండా కలబుర్గిలోని

ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గర్భస్రావం చేయించాడు.

Also Read:
కీచక కానిస్టేబుల్.. మహిళను బెదిరించి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం

అయితే అదికాస్తా వికటించి శిభ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం బయటకు తెలిస్తే తాను జైలుకెళ్లాల్సి వస్తుందన్న ఆందోళన చెందిన ప్రియుడు తన ఫ్రెండ్ సాయంతో ఈ నెల 4న ఆమె మృతదేహాన్ని కారులో వేసుకుని వికారాబాద్ జిల్లా రంగంపల్లి శివారులోని హైదరాబాద్-బీజాపూర్ ప్రధాన రహదారి పక్కన పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. హైవే పక్కన సగం కాలిన మృతదేహాన్ని చూసిన వాహన.దారులు పరిగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దర్యాప్తు చేపట్టారు.

యువతి వివరాలు తెలుసుకునేందుకు తెలంగాణతో పాటు కర్ణాటకలోకి కొన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. గుల్బర్గా జిల్లాలోని బ్రహ్మపూర్ పోలీస్‌స్టేషన్లో యువతి మిస్సింగ్ కేసు నమోదైనట్లు తెలుసుకుని ఆ దిశగా విచారణ చేపట్టి మృతురాలిని శిభగా గుర్తించారు. ఆమె స్నేహితులను ఆరా తీయగా ప్రేమ వ్యవహారం, అబార్షన్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పరిగి పోలీసులు ఈ కేసును బ్రహ్మపూర్ పీఎస్‌కు బదిలీ చేశారు. శిభ ప్రియుడిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Also Read:
హద్దులు దాటిన ప్రేమ.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన 16ఏళ్ల బాలిక

Source link

0 0
Next Post

Tamilnadu teacher: అంగన్‌వాడీ వర్కర్‌తో స్కూల్‌లోనే సెక్స్.. టీచర్‌ను కుమ్మేసిన గ్రామస్థులు - tamilnadu teacher caughtn with anganwadi worker having sex in govt school

పవిత్రమైన పాఠశాలను కామక్రీడలకు నిలయంగా మార్చేసిన స్కూల్‌ టీచర్‌ను గ్రామస్థులు చితక్కొట్టారు. అంగన్‌వాడీ టీచర్‌తో స్కూల్‌లో సెక్స్ చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. Samayam Telugu | Updated:Sep 11, 2019, 03:16PM IST పిల్లలకు పాఠాలు చెబుతూ మంచి బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే వక్రమార్గం పట్టాడు. సరస్వతీ నిలయంగా భావించే పాఠశాలనే తన కామక్రీడలకు నిలయంగా మార్చేశాడు. తమిళనాడులోని నామక్కల్ జిల్లా ఉడుప్పమ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ వ్యక్తి […]