kakinada black magic : కాకినాడలో చేతబడి కలకలం.. మహిళ ఇంటిని ధ్వంసం చేసిన స్థానికులు – locals attack on woman over black magic issue in kakinada

admin
Read Time3 Minute, 5 Second


తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చేతబడి కలకలం రేపింది. చేతబడి చేస్తోందన్న నెపంలో స్థానికులు కొయ్యాల పాపమ్మ అనే మహిళపై దాడికి పాల్పడ్డాడు. వందలాది మందిగా ఆమె ఇంటికి చేరుకున్న ప్రజలు ఇంట్లోకి ప్రవేశించి వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ఆమెను బయటకు ఈడ్చుకొచ్చి విచక్షణా రహితంగా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాధితురాలిని రక్షించారు.


Also Read:
పోర్న్ ప్రియులకు షాక్… చెన్నైలో 30 మంది అరెస్ట్‌కు రంగం సిద్ధం

పాపమ్మ చేతబడి చేయడంతో కోనాడ సత్యనారాయణ అనే వ్యక్తి 15 రోజుల క్రితం చనిపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం పాపమ్మ ఓ యువతితో మాట్లాడిందని, బుధవారం ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిందని చెబుతున్నారు. తాము వెంటనే అప్రమత్తమై అడ్డుకోవడంతో యువతి ప్రాణాపాయం నుంచి బయటపడిందని కుటుంబసభ్యులు తెలిపారు. యువతిపై పాపమ్మ చేతబడి చేయడంతో ఆత్మహత్యకు యత్నించిందని వారు ఆరోపిస్తున్నారు.

Also Read:
ఎయిర్‌హోస్టెస్‌తో నాలుగేళ్లు సహజీవనం.. రూ.15లక్షలు దోచుకుని

ఈ కారణంగానే గురువారం స్థానికులు పాపమ్మ ఇంటిపై దాడి చేసి ఆమెను చితక్కొట్టారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బాధితురాలిని వేరే ప్రాంతానికి తరలించారు. పాపమ్మ ఇంటి వద్ద పహారా ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు కాకినాడ పోలీసులు తెలిపారు.

Also Read:
రేప్ కేసు పెట్టేందుకు వెళ్లిన బంగ్లా యువతి… వ్యభిచారం కేసులో అరెస్ట్





Source link

0 0
Next Post

jharkhand illegal Affair : అల్లుడితో అత్త రొమాన్స్.. ఇద్దరినీ మంచంపై చూసి షాకిచ్చిన భర్త - jharkhand woman illegal affair with son in law caight red handedly by her husband

లారీడ్రైవర్ అయిన భర్త తరుచూ ఇంట్లో లేకపోవడంతో ఓ మహిళ నీచానికి పాల్పడింది. మేనల్లుడిని మభ్యపెట్టి అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుని రాసలీలలు సాగించింది. జార్ఖండ్ రాజధాని రాంచీ పట్టణంలో నివసించే శ్యామ్ లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో కుమారి(పేరు మార్చాం) ఓ ప్రాంతంలో నివసిస్తున్నారు. శ్యామ్ నెలలో సగం రోజులు ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో కుమారి ఒంటరిగా ఉండేది. Also Read: రేప్ కేసు పెట్టేందుకు వెళ్లిన బంగ్లా యువతి… […]