kadapa job cheater: ‘ఆ మంత్రి మా బంధువే.. రూ.5లక్షలిస్తే జాబ్ పక్కా’ – man held for cheating youth on name of govt jobs in kadapa

admin
Read Time4 Minute, 10 Second


మంత్రి, ఎంపీ తనకు బంధువులని, వారితో చెప్పించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రచారం చేస్తూ యువకులను మోసం చేస్తున్న మున్సిపల్ ఉద్యోగిని కడప పోలీసులు అరెస్ట్ చేశారు.

Samayam Telugu | Updated:

హైలైట్స్

  • ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల
  • ఓ యువకుడి నుంచి రూ.5లక్షల వసూలు
  • నిందితుడిని అరెస్ట్ చేసిన కడప పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తుండటం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. దీన్ని ఆసగారా తీసుకుని ప్రభుత్వోద్యోగం ఇప్పిస్తామంటూ కొందరు కేటుగాళ్లు నిరుద్యోగులకు వల వేస్తున్నారు. తాజా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి పేరుతో ఓ ప్రభుత్వోద్యోగి వసూళ్లకు తెరదీశాడు. ఓ యువకుడికి రూ.5లక్షలిస్తే పంచాయతీ సెక్రటరీ జాబ్ ఇప్పిస్తానని నమ్మించాడు. విషయం బయటకు రావడంతో పోలీసులు నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు.


కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న పోరుమామిళ్ల రమేశ్‌బాబు అనే వ్యక్తి నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. అదే జిల్లాకు చెందిన అహ్మద్ అనే వ్యక్తికి పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.5లక్షలు వసూలు చేశాడు. ఇంతటితో ఆగకుండా ‘మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డీ నాకు బంధువులే. ఐదు లక్షలిస్తే డైరెక్ట్‌గా సచివాలయ సెక్రటరీ పోస్ట్‌ ఇప్పిస్తా’ అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారానికి దిగాడు. ఈ ప్రకటన చూసిన చాలామంది నిరుద్యోగులు అతడిని సంప్రదించారు.

ఈ విషయం మంత్రి పెద్దిరెడ్డి కార్యదర్శికి తెలియడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలన్నీ పారదర్శకంగా జరుగుతాయని, ఇలాంటి మోసగాళ్ల చేతుల్లో నిరుద్యోగులు మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Web Title man held for cheating youth on name of govt jobs in kadapa

(Telugu News from Samayam Telugu , TIL Network)

 

Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Source link

0 0
Next Post

bilawal bhutto on kashmir: కశ్మీర్‌పై పాక్ ప్రధానికి భుట్టో ఆసక్తికర సూచన.. భవిష్యత్తును ఊహించారా? - opposition leader bilawal bhutto tells imran khan focus on saving pok

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను భారత ప్రభుత్వం రద్దుచేయడంతో పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై భారత్‌తో అణు యుద్ధానికి కూడా వెనుకాడబోమని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. అయితే, కశ్మీర్ విషయంలో ఇమ్రాన్ అనుసరిస్తోన్న తీరుపై పాక్‌లో విపక్షాలు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం శ్రీనగర్‌ మాట అటుంచింతే పాక్ ఆక్రమిత కశ్మీర్, ముజఫరాబాద్‌లు […]