janasena bjp meeting : బెజవాడలో బీజేపీ, జనసేన కీలక భేటీ.. ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం? – bjp and janasena to conduct key meeting in vijyawada on january 16th

admin
Read Time44Seconds


ఢిల్లీ నేరుగా విశాఖ చేరుకొని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ వెళ్లిన పవన్ కళ్యాణ్.. జనసేన కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవడం, అమరావతి రైతుల ఆందోళనలు, అక్కడి ఆడపడుచులపై దాడి చేయడం లాంటి అంశాలను గత కొద్ది రోజులుగా కేంద్రానికి తెలియజేస్తున్నామన్న పవన్.. ఢిల్లీ నుంచి పిలుపు రాగానే అక్కడకు వెళ్లానన్నారు. ప్రధాని ఏ ఆశయాలతో ముందుకు వెళ్తున్నారో.. అవి ఏపీలో కనిపించడం లేదన్న జనసేనాని.. రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి సారించాలని ఢిల్లీ పెద్దలను కోరినట్లు తెలిపారు.


జనవరి 16న విజయవాడలో కీలకమైన మీటింగ్ జరగబోతుందన్న పవన్.. తర్వాత వివరాలను తెలియజేస్తామన్నారు. జనసేన, బీజేపీ పార్టీలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయని తెలిపారు. ఈ భేటీ తర్వాత మీడియా సమావేశం నిర్వహిస్తామన్నారు. బీజేపీ, జనసేన కలిసి ముందుకెళ్తాయని వార్తలు వెలుడుతున్న వేళ.. పవన్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. జనవరి 16నే పొత్తు గురించి ఇరు పార్టీలు ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.

రాజధాని ఒక చోట, అభివృద్ధి అంతటా ఉండాలన్న జనసేనాని.. అంబేద్కర్ వింకేద్రీకరణ కోరుకున్నారని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే జగన్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బీజేపీ, జనసేన సమావేశం రోజునే అమరావతి విషయంలోనూ ఇరు పార్టీలు సంయుక్తంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.





Source link

0 0
Next Post

AAP candidates list : Delhi Elections: ఆప్ అభ్యర్థుల జాబితా.. 23 కొత్త ముఖాలు, ఆరుగురు కాంగ్రెస్ నుంచి.. - aap releases candidates list for delhi assembly elections, kejriwal give chance to 23 new faces

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో దూకుడు మీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. మంగళవారం 70 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. 23 కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చిన కేజ్రీవాల్.. కాంగ్రెస్ నుంచి తమ పార్టీలో చేరిన ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇచ్చారు. 8 మంది మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్లను ఇచ్చింది. 2015లో ఆ పార్టీ ఆరుగురు మహిళలకు టికెట్ ఇచ్చింది. కేజ్రీవాల్ సిట్టింగ్ మంత్రులను ఎవర్నీ పక్కనబెట్టలేదు. […]