iran coronavirus deaths : ఒక్క రోజే 49 మంది మృతి.. ఇరాన్‌‌లో కరోనా మరణ మృదంగం – coronavirus kills 49 in iran in 24 hours, highest single-day deaths, toll rises to 194

admin
Read Time3 Minute, 34 Second


రాన్‌లో కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఆ దేశంలో ఒక్క రోజే 49 మంది మృతి చెందారు. కోవిడ్-19 కారణంగా దేశంలో గత 24 గంటల్లో 49 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి యానుష్ జహాన్‌పూర్ ఆదివారం (మార్చి 8) తెలిపారు. దేశంలో కరోనాతో ఇప్పటివరకు 194 మంది ప్రాణాలు కోల్పోయారు. 6566 మంది కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇరాన్‌లో అక్కడా, ఇక్కడా అని కాకుండా మొత్తం 31 ప్రావిన్సులకు కరోనా పాకింది. తన ప్రభావం చూపుతోంది.


కరోనా వైరస్ ప్రభావం చైనా తర్వాత ఇరాన్ దేశం పైనే అత్యంత తీవ్రంగా ఉంది. ఆ దేశం చేసిన నిర్లక్ష్యమే అందుక్కారణం. కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో అన్ని దేశాలు ముందస్తు చర్యలు ప్రారంభించినా.. ఆ వైరస్ తమను ఏమీ చేయలేదన్నట్లుగా ఇరాన్ చూస్తుండిపోయింది. ఆ తర్వాత మేల్కొనేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తమ దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెద్దగా లేదంటూ ఆరోగ్య మంత్రి మీడియా సమావేశం పెట్టి వెల్లడించిన మరుక్షణమే.. ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలడం గమనార్హం.

Don’t Miss:
బర్డ్‌ ఫ్లూ అటాక్.. తరుముకొస్తున్న మరో వైరస్

ఫిబ్రవరి 19న ఇరాన్‌లో తొలి కేసు నమోదైంది. వెంటనే మేల్కొని ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదని విమర్శలు వస్తున్నాయి. తాజాగా కరోనా కారణంగా మృతి చెందిన వారిలో.. పలువురు ప్రముఖులు, అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రాశ్య దేశాల కేంద్ర బిందువుగా ఉన్న ఇరాన్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటంతో సమీప దేశాలు వణికిపోతున్నాయి. భారత్ సహా పలు దేశాలకు ఇరాన్ నుంచే కరోనా వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో ఆ దేశం నుంచి విమాన సేవలను పూర్తిగా నిలిపివేశారు.

Must Read:
కేసీఆర్‌ బర్త్ సర్టిఫికెట్ ఎవరూ అడగలేదు.. కిషన్ రెడ్డి ఫైర్

Also Read:
మారుతీరావు మృతి.. పోలీసులు ఏం చెప్పారంటే..

Source link

0 0
Next Post

isis couple in delhi : ఐసిస్‌తో సంబంధాలున్న జంట అరెస్ట్.. ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి కుట్ర! - is-linked couple arrested in delhi, they had plans for suicide attack

ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్న ఓ జంటను నిఘా వర్గాల సమాచారం మేరకు ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ జంట నైరుతి ఢిల్లీలోని ఒఖాలా ప్రాంతంలో నివసిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను వీరు ప్రేరేపిస్తున్నారని, యువతను ఉగ్రవాదం దిశగా ఆకర్షిస్తున్నారని సమాచారం. వీరిని జహన్జీవ్ సమీ, హీనా బషీర్ బేగ్‌గా గుర్తించిన పోలీసులు ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. అప్ఘానిస్థాన్‌లో ఖొరాసాన్ […]