hyderabad techie missing : 15రోజులైనా దొరకని రోహిత ఆచూకీ.. పోలీసుల తీరుపై విమర్శలు – woman techie from hyderabad goes missing remains untraced even after 15 days

admin
Read Time46Seconds


హైదరాబాద్‌లో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోహిత(34) మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఆమె 15రోజులుగా కనిపించకుండా పోయిన ఆమె ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు ఆమె కోసం ఎంత వెతికినా ఆచూకీ కనుక్కోలేకపోయారు. ఆమె హైదరాబాద్‌లోనే తిరుగుతున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులపై విమర్శలు వస్తున్నాయి.


Also Read:
11 రోజులైనా దొరకని యాపిల్ ఉద్యోగిని ఆచూకీ… భర్తను ప్రశ్నించిన పోలీసులు

రోహితను పట్టుకోవడంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. రోహిత ఫోటోని కంట్రోల్ రూమ్‌కి పంపినప్పటికీ వెంటనే అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపించలేదని చెబుతున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి అన్ని పోలీస్‌స్టేషన్లకు ఫోటో వెళ్లినప్పటికీ కొన్నిచోట్ల ఆ ఫోటోను ఇప్పటికీ డౌన్‌లోడ్ చేయలేదని రోహిత సోదరుడు ఆరోపిస్తున్నారు. ఏడో తేదీన మిధాని డిపో వద్ద రోహిత గంటసేపు తిరిగినా స్థానిక పోలీసులు గుర్తుపట్టలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం సికింద్రాబాద్‌లో కనిపించిన రోహిత ఆ తర్వాత బస్సులో మిధాని డిపోకు చేరుకుందని, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందన్న దానిపై మాత్రం స్పష్టత రావడం లేదని ఆమె సోదరుడు చెబుతున్నాడు. 15 రోజులుగా రోహిత కోసం గాలిస్తున్న పోలీసులు ఆమె నగరంలో తిరుగుతున్న రోహితాను గుర్తించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Also Read:
దళిత యువతిపై సామూహిక అత్యాచారం.. చంపేసి ఆపై చెట్టుకు వేలాడదీసి

చాదర్‌ఘట్‌ ప్రాంతానికి చెందిన రోహిత(34) నానక్‌రాంగూడలోని యాపిల్ ఇండియా సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. 2018లో ఓ వ్యక్తితో వివాహమైనా 13 నెలలకే విబేధాలతో విడిపోయారు. దీంతో మరో ఇద్దరితో కలిసి నానక్‌రామ్‌గూడలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటోంది. డిసెంబర్ 26వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోహిల విప్రో సర్కిల్ వద్ద ఆటో ఎక్కినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె సోదరుడు 27వ తేదీన గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. అయితే రోహిత తన సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ను ఇంట్లోనే వదిలివెళ్లడంతో ఆమె ఆచూకీ గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది.

Also Read:
హద్దులు దాటిన ప్రేమికులు.. ప్రియురాలు గర్భం దాల్చిందని తెలిసి దారుణహత్య

Source link

0 0
Next Post

Amaravati : YS Jaganకు సీఎం కుర్చీ వాళ్లిద్దరి భిక్ష.. TDP అంతు చూసే మగాడు రాలేదు: అనిత - tdp leader vangalapudi anitha fires on cm ys jagan about amaravati issue

టీడీపీ కార్యకర్తల అంతు చూసే మగాడు ఇప్పటి వరకూ రాలేదన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. నన్ను తప్పుగా అనుకున్నా.. ట్రోల్స్ చేసినా ఫర్వాలేదు.. కానీ టీడీపీ కార్యకర్తను టచ్ చేసే దమ్ము రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ఎవరికీ లేదన్నారామె. అందుకే నేరుగా ఎదుర్కోలేక పోలీసులను అడ్డం పెట్టుకొని మా మీద కేసులు పెట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. గుంటూరులో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఏపీ సీఎం జగన్ […]