Hyderabad Son-in-law rape : అత్తపై అత్యాచారం.. భార్యకు విడాకులిస్తానని పరార్! – hyderabad man rapes aunty: threatening to wife over divorce

admin
Read Time3 Minute, 22 Second


తల్లి తర్వాత అంతటి విశిష్ట స్థానంలో ఉండే అత్తపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో అతడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మహిళ హైదరాబాద్‌కు వలస వచ్చి ఆసీఫ్‌నగర్, దత్తాత్రేయ కాలనీలోని స్టోన్‌ వ్యాలీలో ఉండేది. గత రెండేళ్లుగా శ్రీనగర్‌కాలనీలో ఉంటున్న కుమార్తె ప్రశాంతి, అల్లుడు హార్థిక్‌ గాంధీ ఇంట్లో ఉంటూ వారి కుమారుడిని చూసుకునేది.


Also Read:
షాక్.. ‘కృష్ణా’లో మైనర్ కూతురిని ప్రియుడి పక్కలోకి పంపిన తల్లి..

నిద్రపోతుండా నోరుమూసి..

కొంత కాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆమె గత నెల 13న మాత్రలు వేసుకుని నిద్రపోయింది. అదే రోజు అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన హార్థిక్‌ అత్త గదిలోకి వెళ్లి నోరుమూసి లైంగికదాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం బాధితురాలు ఈ విషయాన్ని కుమార్తెకు చెప్పింది.

Also Read: ‘దిశ’ బిల్లు ఆమోదం పొందిన గంటల్లోనే.. బాలికపై అత్యాచారం!

విడాకులిస్తానని భార్యకు బెదిరింపులు

ఈ విషయమై హార్థిక్‌ను నిలదీయగా, తనను క్షమించాలని, క్షణికావేశంలో జరిగిందని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు. దీంతో అతడికి ఫోన్‌ చేయగా తాను ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని, నీకు విడాకులు ఇచ్చి, ప్రతి నెలా భరణం ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో బాధితురాలు, ఆమె కుమార్తెతో కలిసి శుక్రవారం రాత్రి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:
ఏపీలో మరో మైనర్ బాలికపై అత్యాచారం.. ‘దిశ’ బిల్లు పాసైన గంటల్లోనే!





Source link

0 0
Next Post

Guntur Five Years Old Rape Victim : ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. అట్టుడుకుతున్న గుంటూరు - 5 years child rape case: women groups, political parties protest in guntur

గుంటూరులో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిని ఉన్మాదిని శిక్షించాలంటూ మహిళా సంఘాలు, విపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. జీజీహెచ్‌‌లో చికిత్స పొందుతున్న చిన్నారికి బాసటగా ఆయా పార్టీల నాయకులు ఆస్పత్రి కాన్పుల వార్డు ఎదుట శనివారం ధర్నాకు దిగారు. రాష్ట్ర హోం మంత్రి తక్షణమే రావాలని, బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనతోనే ‘దిశా’ చట్టాన్ని అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఆందోళనలతో అట్టుడికిన […]