hyderabad honey trap: ఐదేళ్లలో 27 మంది యువకులకు వల.. పోలీసులకు చిక్కిన మహిళా న్యాయవాది – honey trap: woman lawyer arrested in hyderabad

admin
Read Time4 Minute, 23 Second


పెళ్లి కాని యువకులను మాయమాటలతో ముగ్గులోకి దించి వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి బెదిరిస్తున్న కిలేడీని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మొదట మాయ మాటలతో యువకులను ముగ్గులోకి దించుతుంది. ఆ తర్వాత బాగా సన్నిహితమవుతుంది. కొన్నాళ్లకు.. నాపై అత్యాచారానికి యత్నించావు.. బెదిరింపులకు పాల్పడ్డావంటూ వారిపై అక్రమంగా కేసులు పెడుతూ.. బ్లాక్‌మెయిల్‌ చేస్తుంది’ అని పోలీసులు ఈ మాయలేడి గురించి మీడియాకు వివరించారు.

Also Read:
గంటకు రూ.2వేలు.. సెక్స్ వర్కర్లకు ఇచ్చేది మాత్రం రూ.వెయ్యే


మలక్‌పేట్‌ ప్రాంతానికి చెందిన షాదాన్‌ సుల్తానా(27) న్యాయవాదిగా పని చేస్తోంది. ఆమెకు అబిడ్స్‌లోని మైనారిటీ సంక్షేమ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ రికార్డు అసిస్టెంట్‌ రహీంతో 2015లో పరిచయం ఏర్పడి సన్నిహితంగా మెలిగింది. రహీంతో ఫోన్లో తరుచూ మాట్లాడుతూ అతడిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. అప్పుడప్పుడు అతడితో శారీరకంగా కలిసి వీడియో తీసింది. కొద్దిరోజుల తర్వాత ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని రహీంను బెదిరించింది. దీంతో అతడు రూ.3లక్షలు ఆమె బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశాడు. మరో రూ.5లక్షలు ఇవ్వాలని మళ్లీ వేధించడంతో మనస్తాపానికి గురై అక్టోబర్ 19న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

Also Read:
12ఏళ్ల బాలికను ప్రియుడు రేప్ చేస్తుంటే వీడియోలు తీసిన ఫ్రెండ్స్

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి రహీం స్టేట్‌మెంట్‌ రికార్డు చేయగా షాదాన్‌ సుల్తానా ఆగడాల చిట్టా వెలుగులోకి వచ్చింది. సుల్తానా 2014 నుంచే ప్రేమ నాటకాలు మొదలు పెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ ఏడాది ఇద్దరు యువకులను ప్రేమ పేరుతో లొంగదీసుకుని బెదిరించింది. 2018లో 14 మందిని, 2019లో ముగ్గురిని వలలో వేసుకుని మోసం చేసింది. బాధితుల ఫిర్యాదుతో సుల్తానాపై సైఫాబాద్‌ పీఎస్‌లో 3, చాదర్‌ఘాట్‌లో 5, ఎల్బీనగర్‌లో 3, అంబర్‌పేట్‌ 2, అబిడ్స్‌లో 2, మీర్‌ చౌక్‌లో 4, నారాయణగూడ, మలక్‌పేట్, నల్లకుంట, ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో మొత్తం 27 కేసులు ఆమెపై ఉన్నాయి. ఈమె బాధితుల్లో ఓ యంగ్ లాయర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:
ప్రకాశం: అమ్మాయిల్ని ట్రాప్ చేసి సెక్స్ టాయ్స్‌తో మహిళ వికృతం.. పోలీసులకే షాక్

Source link

0 0
Next Post

Six scuba divers remove 4,000 kg plastic from sea in Andhra Pradesh- The New Indian Express

Express News Service VISAKHAPATNAM: Six scuba diving instructors of Platypus Escapes, a Rushikonda-based company, have been diving two metres down under the sea every day to remove plastic waste accumulated there. They have collected over 4,000 kg of plastic waste in 13 days. This team dives into the sea from […]