husband murder sketch : అక్రమ సంబంధం చిచ్చు.. మటన్‌ కర్రీలో సైనేడ్ కలిపి భర్త హత్యకు కుట్ర – murder attempt on husband, wife, son and 3 persons arrested in west godavari district

admin
Read Time46Seconds


భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ భార్య దారుణానికి పాల్పడింది. నిజానిజాలు తెలుసుకోకుండా అతడిని చంపేందుకు కుట్ర పన్నింది. హత్య జరిగినా తాను బయటపడకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అయితే చివరి క్షణంలో ఆమె భర్త కుట్రను పసిగట్టడంతో ఆమె కటకటాలు లెక్కపెడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగుచూసిన సైనేడ్ మర్డర్ కుట్ర వివరాలు షాకిస్తున్నాయి.


Also Read:
ఎదురింటి యువకుడితో ఆంటీ అఫైర్.. బెడ్రూమ్‌లో రొమాన్స్ చేస్తూ భర్తకు దొరికేసి

భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామానికి చెందిన గోవింద్‌ గురునాథ్‌ పాల వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య రాణి కిళ్లీ కొట్టు నిర్వహిస్తోంది. ఇటీవల భర్త ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న రాణి అతడితో తరుచూ గొడవలు పడుతోంది. పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ అతడిని వేధిస్తోంది. తనకు ఎవరితోనూ అక్రమ సంబంధం లేదని గురునాథ్ చెప్పినా వినిపించుకోవడం లేదు. ఈ క్రమంలోనే తనను మోసం చేస్తున్న భర్తను చంపేయాలని రాణి నిర్ణయించుకుంది.

Also Read:
ప్రియురాలిపై చాక్లెట్ విసిరిన ఆటోడ్రైవర్.. ఆమె భర్త కంటపడటంతో

ఇందుకు కుమారుడితో పాటు అదే గ్రామానికి చెందిన ధనలక్ష్మి, శ్రీనివాసరావు సలహా తీసుకుంది. సైనేడ్ తినిపిస్తే ఎవరికీ అనుమానం రాదని వారు చెప్పడంతో ద్వారకాతిరుమల మండలం జాజులకుంటకు చెందిన గంటా మోజెస్‌ సహకారంతో సైనేడ్‌ తెచ్చారు. దాన్ని ముందు కోడిపుంజుపై ప్రయోగించగా సఫలమైంది. అయితే తన కోడిపుంజు రంగు మారిపోవడంతో గురునాథ్ అనుమానం వ్యక్తం చేయగా.. తెగులు సోకి చనిపోయిందని రాణి నమ్మించింది. ఆదివారం భర్త కోసం మటల్ కూర వండిన రాణి అతడికి పెట్టింది. అయితే బయట వ్యక్తులు సైనేడ్ గురించి మాట్లాడుకోవడం విన్న గురునాథ్‌కు భార్యపై అనుమానం వచ్చింది.

Also Read:
మెకానిక్‌తో అఫైర్.. టిక్‌టాక్‌‌లో వీడియోలు.. పరువు తీస్తోందని భార్యను చంపేసిన భర్త

ఏదో ఆలోచించుకుంటూ మొదటి ముద్ద తినగా కూర రుచి వేరేలా అనిపించింది. దీంతో కంగారుపడిన గురునాథ్ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మటన్ కూరను స్వాధీనం చేసుకుని పరీక్ష చేయగా సైనేడ్ కలిసినట్లు తేలింది. దీంతో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. భర్తను చంపేందుకు రాణి వేసిన ప్లాన్ తెలిసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అమాయకంగా కనిపించే ఆమె భర్తనే చంపడానికి కుట్ర పన్నిందా? అంటూ షాకవుతున్నారు

Also Read:
పెళ్లయిన 16 రోజులకే ఫ్యాన్‌కు వేలాడిన యువతి.. హత్యే అంటున్న తల్లిదండ్రులు

Source link

0 0
Next Post

mother kills son : కొడుకుని చంపేసి.. భర్తపై నెట్టేసి.. ఆ సంబంధం కోసం మహిళ దారుణం - woman murders own toddler, implicates husband to elope with paramour in kannur of kerala

ప్రియుడిపై మోజుతో భర్త, కన్నకొడుకుని అడ్డుతొలగించుకోవాలని భావించిన ఓ రాక్షసి నీచానికి దిగింది. కొడుకుని చంపేసి ఆ నేరాన్ని తన భర్తపై వేసి ప్రియుడితో ఎంచక్కా ఎంజాయ్ చేద్దామనుకుంది. ఏడాదిన్నర కొడుకుని అత్యంత కిరాతకంగా హత్య చేసింది. తన భర్తే కొడుకుని హత్య చేసినట్లు నమ్మించేందుకు యత్నించింది. ఈ దారుణ ఘటన కేరళలో జరిగింది. కన్నకొడుకుని తల్లే అత్యంత దారుణంగా చంపేసిన ఘటన కన్నూరులో చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా […]