human trafficking in pakistan: పాక్: 629 మందిని పెళ్లిపేరుతో చైనాకు అమ్మేసి బలవంతంగా వ్యభిచారం! – trafficking networks in pakistan, 629 girls and women from across country sold as brides to china

admin
Read Time5 Minute, 19 Second


పేదరికాన్ని ఆసరాగా తీసుకుని పెళ్లి పేరుతో పెద్ద ఎత్తున మహిళలను అక్రమంగా పాకిస్థాన్ నుంచి చైనాకు తరలించి, వారిని బలవంతంగా వ్యభిచారం కూపంలోకి నెట్టేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పాక్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 629 మంది మహిళలను పెళ్లి పేరుతో చైనా ముఠాలకు అమ్మేసినట్టు పాకిస్థాన్ అధికారుల దర్యాప్తు నివేదిక అసోసియేటెడ్ ప్రెస్‌కు చిక్కింది. ఈ నివేదిక ప్రకారం.. 2018 నుంచి అక్రమరవాణా చిక్కుకున్న బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది. గత జూన్ నుంచి మహిళల అక్రమ రవాణా ముఠాల పట్ల దర్యాప్తు అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.


అయితే, చైనాతో ఉన్న సత్సంబంధాలు దృష్యా పాక్ ఉన్నతాధికారులు వారిపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, మహిళ అక్రమ రవాణాలో నిందితులుగా ఉన్న మొత్తం 31 మంది చైనా పౌరులను అక్టోబరులో ఫైసలాబాద్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కానీ, మొదట్లో పోలీసుల విచారణలో చాలా మంది మహిళలు సాక్ష్యాలను చెప్పడానికి నిరాకరించారు.. ఎందుకంటే వీరిని బెదిరించడం లేదా డబ్బు ఆశచూపడం లాంటి చర్యలతో నోరు నొక్కేశారు. పోలీసులు, న్యాయస్థానం అభిప్రాయం ప్రకారం… వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే ప్రతీకారం తీర్చుకుంటారని భయపడ్డారు.

ఇదే సమయంలో మహిళ అక్రమ రవాణా కేసుల్లో దర్యాప్తు అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందని సామాజిక కార్యకర్త సలీమ్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. కొంత మంది అధికారులను బదిలీచేశారని ఆయన తెలిపారు. అక్రమ రవాణ ముఠాల చేతిలో చిక్కుకుని నరకం అనుభవిస్తున్న కొంత మంది యువతులను రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించడంలో ఇక్బాల్ విశేషంగా కృషిచేస్తున్నారు.

‘ఈ వ్యవహారంపై పాకిస్థాన్ పాలకులు నోరు మెదపడంలేదు. కొంత మంది ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తు జాప్యం చేస్తున్నారు… చైనాలోని వ్యభిచార కూపంలో చిక్కుకున్న యువతలకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని’ ఓ అధికారి వ్యాఖ్యానించారు. ముఠాల కార్యకలాపాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నాయని, ఈ విషయం తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. పైస్థాయి నుంచి ఒత్తిడి అధికంగా ఉందని ఆయన అన్నారు.

మరోవైపు, ఈ విషయం తమకు తెలియని చైనా విదేశాంగ శాఖ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. పాకిస్థాన్‌లోని క్రిస్టయన్ మైనార్టీ యువతులను చైనా ముఠాలు టార్గెట్ చేసినట్టు అసోసియేట్ ప్రెస్ విచారణలో తేలింది. తల్లిదండ్రులకు డబ్బులు ఆశచూపి వివాహం చేసుకుని వారిని తమ వెంట చైనాకు తీసుకెళ్తారు. అక్కడ వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు. పాక్‌లోని పేద వర్గాలకు చెందిన వారిలో క్రిస్టియన్లు ఒకరు కావడంతో వారినే టార్గెట్ చేస్తున్నారు. చైనాకు చెందిన పెళ్లి కొడుకుల నుంచి 25,000 నుంచి 65,000 డాలర్లు అంటే రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకూ మధ్యవర్తులు వసూలు చేసి, యువతుల తల్లిదండ్రులకు కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లిస్తుంటారు.

Source link

0 0
Next Post

Will protect Hindu Dharma while staying secular: Pawan Kalyan

Jana Sena Party (JSP) President Pawan Kalyan hit out openly against mass religious conversions. He demanded the State government make its stand clear on the issue. He announced his commitment to protect Hindu Dharma, even while staying secular. Addressing a media conference here on Wednesday, he said every religion should […]