holiday on doctors day: వైద్యులకు వందనం.. జులై 1ని సెలవుదినంగా ప్రకటించిన సీఎం మమత – west bengal cm mamata banerjee declares national doctor’s day on july 1st as state holiday

APNEWS CO
Read Time1 Minute, 48 Second


రోనా మహమ్మారితో ముందు వరసలో ఉండి పోరాటం చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘనంగా గౌరవం ప్రకటించారు. జాతీయ వైద్యుల దినోత్సమైన జులై 1ని వారి గౌరవార్థం తమ రాష్ట్రంలో సెలవు రోజుగా ప్రకటిస్తున్నట్లు ఆమె సోమవారం (జూన్ 29) తెలిపారు. కేంద్రం కూడా దీన్ని పాటించాలని సూచించారు.

కరోనా వ్యాప్తిని ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని సీఎం మమత బెనర్జీ తెలిపారు. వైరస్‌ నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. అయితే.. ప్రజలు మాత్రం నియంత్రణ చర్యలు పాటించాలని సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటివే సురక్షిత మార్గాలని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం 3 కోట్ల మాస్కులను కొనుగోలు చేసిందని ముఖ్యమంత్రి మమత తెలిపారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ మాస్కులను అన్ని రంగాల వారికి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు.

Don’t Miss:నాకు కరోనా.. నేను క్రిమినల్‌ని కాదు, హైదరాబాద్ జర్నలిస్ట్ ఆవేదన

Also Read:కరోనా యోధుడికి సెల్యూట్.. రూ.కోటి ప్రకటించిన సీఎం కేజ్రీవాల్



Source link

0 0
Next Post

What Happened During Jeyaraj-Beniks Arrests? CCTV Footage Counters Cops

Amid spiralling anger over the deaths in Tamil Nadu of a man and his son arrested for keeping their shop open beyond permitted hours, security footage appears to contradict claims that the two men had… Source link